TTD Special Darshanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. శ్రీవారి దర్శనం ప్రత్యేక టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. అక్టోబర్ 25 నుంచి ప్రత్యేక ప్రవేశ టికెట్లు అందుబాటులో రానున్నాయి.
తిరుమల భక్తులకు టీటీడీ(TTD)దేవస్థానం శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో తీసుకొస్తోంది. ప్రత్యేక దర్శన టికెట్లను ఈ నెల 25 నుంచి విడుదల చేయనున్నామని టీటీడీ తెలిపింది. అక్టోబర్ నెలకు సంబంధించి 3 వందల రూపాయుల ప్రవేశ దర్శన టికెట్లు(Special Darshanam Tickets) అందుబాటులో ఉండనున్నాయి. దర్శనానికొచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
మరోవైపు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టికెట్లు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకూ రోజుకు 8 వేలవరకూ విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టికెట్లు అందుబాటులో వచ్చిన తరువాత ఆఫ్‌లైన్ సర్వదర్శనం టికెట్ల పంపిణీ నిలిపివేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల్నించి పెద్దసంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం వస్తున్న నేపధ్యంలో కరోనా సంక్రమణను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(Corona Vaccination Certificate) లేదా దర్శన సమయానికి ముడ్రోజుల ముందు కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలి. కోవిడ్ నియంత్రణకై విధించి ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Also read: Beautiful Temples: ఇండియాలోని అందమైన ఏడు ఆలయాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook