Horoscope Today January 27 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం!!

Today's Horoscope January 27 2022: కర్కాటక రాశి వారికి పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 06:55 AM IST
  • గురువారం .. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం
Horoscope Today January 27 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి పూర్తి మిశ్రమకాలం!!

Today's Horoscope January 27 2022: నేటి రాశి ఫలాలను ఓసారి గమనిస్తే.. కొన్ని రాశుల వారికి అనుకూల సమయం నడుస్తోంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 

Aries - మేషం: ప్రారంభించబోయే పనులలో చంచల స్వభావం ఉండకూడదు. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దుర్గాదేవిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

Taurus - వృషభం: శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రారంభించబోయే పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం చదవడం మంచిది.

Gemini - మిథునం: ప్రయత్నిస్తే ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల నిర్ణయం తీసుకోవడం మంచింది. గతంలో ఆగిన పనులు మళ్లీ ప్రారంభం అవుతాయి. కుటుంబ సహకారం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

Cancer - కర్కాటకం: పూర్తి మిశ్రమకాలం నడుస్తోంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా.. అధిగమించే ప్రయత్నం చేయాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. గణపతి స్తోత్రం చదవడం మంచిది.

Leo - సింహం: ఒక శుభవార్త కుటుంబసభ్యుల్లో ఆనందాన్ని నింపుతుంది. విందూ, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కృష్ణాష్టకం చదివితే బాగుంటుంది.

Also Read: Ind vs WI: వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Virgo - కన్య: మంచికాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దల, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శివ స్తోత్రం చదివితే బాగుంటుంది.

Libra - తుల: మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

Scorpio - వృశ్చికం: ప్రారంభించిన పనులలో  ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దల సలహాలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. గణపతి స్తోత్రం చదవండి.

Sagittarius - ధనుస్సు: ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సాయి నామాన్ని జపించాలి.

Capricorn - మకరం: శుభ కాలం నడుస్తోంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు.

Also Read: Video: వేగంగా దూసుకొచ్చి యువకుడిని కుమ్మబోయిన గొర్రె.. ఏం జరిగిందో చూడండి..

Aquarius - కుంభం: కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవాలి.

Pisces - మీనం: మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News