Today Horoscope March 24 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది!!

March 24 2022, Daily Horoscope. మిథునం, సింహ రాశుల వారికి ఈరోజు మంచికాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది. యువకులు నూతన ఉద్యోగాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 07:59 AM IST
  • March 23 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది
 Today Horoscope March 24 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఉద్యోగ ప్రాప్తి ఉంది!!

Today Horoscope March 24 2022: మేషం ( Aries): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. శ్రీలక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

వృషభం (Taurus): ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తరు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మిథునం (Gemini): ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శుభకాలం నడుస్తోంది. బుద్ధిబలం బాగుంటుంది. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు ఉన్నాయి. 

కర్కాటకం (Cancer): పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమం.

సింహం (Leo): మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. ఉద్యోగ ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంది. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.

కన్య (Virgo): శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

తుల (Libra): శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. శ్రీవిష్ణు ఆరాధన మంచిది.

వృశ్చికం (Scorpio): ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకొండి. దుర్గాస్తుతి చదవాలి.

ధనస్సు (Sagittarius): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సమయపాలన పాటించండి. విశ్రాంతి తీసుకోవడం అవసరం. ప్రయాణాలలో ముందు చూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించండి.

మకరం (Capricorn): మంచి ఫలితాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదిత్య హృదయం చదవాలి.

కుంభం  (Aquarius): మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. ప్రయాణ సూచన ఉంది. హనుమాన్ చాలీసా చదవాలి.

మీనం (Pisces): ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఈశ్వర దర్శనం శుభప్రదం.

Also Read: Telangana Job Notifications: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Also Read: Banners Issue: కర్ణాటకలో మరో వివాదమా..ముస్లింలు స్టాల్స్ పెట్టకూడదంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News