Today Horoscope In Telugu 10 June 2021: నేటి రాశి ఫలాలు 10 జూన్ 2021, ఓ రాశివారికి నూతన ఉద్యోగావకాశాలు

Today Horoscope In Telugu 10 June 2021: మీ కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీకోసం నేడు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు, బహుశా మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులు ఆఫీసు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2021, 08:09 AM IST
Today Horoscope In Telugu 10 June 2021: నేటి రాశి ఫలాలు 10 జూన్ 2021, ఓ రాశివారికి నూతన ఉద్యోగావకాశాలు

Horoscope Today In Telugu 10 June 2021: మేష రాశి
ఈ రోజు మీ జీవితంలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులైతే వేరేచోట అవకాశాలను వెతుక్కుంటారు. కొత్త ఇంటికి మారతారు లేదా వేరే ప్రదేశానికి వెళతారు. ఖర్చులు అధికం కానున్నాయి. మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. 

వృషభ రాశి
వృషభ రాశి వారు నేడు చాలా ఓపికగా ఉంటారు. కంపెనీకి రాబోయే ఏ ప్రాజెక్ట్‌లోనైనా మీ సహోద్యోగులు మీతో సహకరిస్తారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు.

Also Read: Solar Eclipse 2021 Date, Timings: తొలి సూర్య గ్రహణం 2021, జూన్ 10న ఆకాశంలో అద్భుతం, Ring of Fire

మిథున రాశి
మీ కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీకోసం నేడు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు, బహుశా మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులు ఆఫీసు నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. కొన్ని విషయాలలో బంధువులు, కుటుంబసభ్యులతో విభేదాలు. 

కర్కాటక రాశి 
మీరు స్నేహితులకు చాలా సమయాన్ని కేటాయిస్తారు. సామాజిక బంధాలు ఏర్పరుచుకుంటారు. మీరు ఉదర లేదా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. కనుక ఇంటి వంటలు మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిది. మీ కెరీర్‌పై దృష్టి పెడతారు. నూతన ఉద్యోగావకావాలు లభిస్తాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. 

సింహ రాశి
ఆర్థిక పరిస్థితిని నేడు సమీక్షించుకుంటారు. కొందరు వ్యక్తులతో పరిచయం మీకు అవకాశాలను దగ్గర చేస్తుంది. దైవదర్శనాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారైతే అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించడం శ్రేయస్కరం.

కన్య రాశి
నేడు మీ ఆర్థిక పరిస్థితిలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మతపరమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. ఖర్చులు పెరగడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

తులా రాశి
ఈరోజు మీరు బయట తిరగడం అంత మంచిది కాదు. మీరు అనారోగ్య సమస్యల బారిన పడతారు. కొన్ని విషయాల కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యాపారులు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు తగదు. 

వృశ్చిక రాశి 
ఈ రాశివారికి పనిలో అన్ని విజయాలు అందుకుంటారు. మీ యజమాని మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. మీ జీవిత భాగస్వామితో సమస్య ఉంటే, చర్చించి పరిష్కరించుకుంటారు. కొన్ని విలువైన వాటి కోసం బ్యాంకులో రుణాల కోసం యత్నిస్తారు. కొందరు మిత్రులు మిమ్మల్ని కలుసుకుని కొత్త విషయాలు చెబుతారు.

ధనుస్సు రాశి
మీకు నేడు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి. మీరు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు అందుకు తగిన సమయం. కోరుకున్న వ్యక్తి నుంచి ప్రేమను పొందుతారు. పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. మరింత శ్రమించి పనిచేయాలని భావిస్తారు. 

మకర రాశి
సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో సామాజిక సంబంధాన్ని పెంచుకోవడంలో మీకు ఇది సహాయపడుతుంది. కానీ కుటుంబసభ్యులు, బంధువుల నుంచి మాటపట్టింపులు, విభేదాలు చికాకు తెప్పిస్తాయి. కొంత సమయం ఒంటరిగా గడపాలని అనుకోవచ్చు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం

కుంభ రాశి
ఉదయం వేళ ఓపిక లేనట్లు ఉంటుంది. కానీ కొంత సమయానికి కోలుకుని మీ పనులను ప్రారంభిస్తారు. నేడు సృజనాత్మకతను ప్రదర్శించేందుకు తగిన సమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, లేదా పాత వ్యాపారాలను పునరుద్ధరించాలనుకుంటే వీరికి నేడు చాలా మంచి రోజు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి.

మీన రాశి
విద్యార్థులు ఉన్నత విద్య, కెరీర్ గురించి ఆలోచిస్తారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తిచేస్తారు. పని పరంగా కొత్త విషయాలు మీకు అప్పగిస్తే  మీరు ఏమాత్రం సంకోచించకుండా తీసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకుంటే మీ నైపుణ్యం పెరగి, నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం మారాలనుకుంటే నిర్ణయం తీసుకోవడానికి నేడు తగిన సమయంగా భావిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News