Dussehra 2022: దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజున మనం దసరా లేదా విజయదశమి జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షం పదో రోజున దసరా ఫెస్టివల్ ను జరుపుకుంటాం. ఈ ఏడాది దసరా పండుగ (Dussehra 2022) అక్టోబరు 5న వచ్చింది. దుర్గాదేవి విగ్రహ నిమజ్జనం, రావణ దహనం వంటి కార్యక్రమాలు విజయదశమి రోజు చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇప్పటికే దేశమెుత్తం దసరా వేడుకలకు సిద్ధమైంది.
విజయవాడ కనకదుర్గ ఆలయంలో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చివరి రోజు కావడంతో దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇవాళ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయదశమి రోజు సాయంత్రం ఆరు గంటలకు కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది. అయితే భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో..దుర్గాఘాట్ వద్ద నిలిపి ఉంచిన హంసవాహనంపై ఒడ్డునే ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజున అమ్మవారిని దర్శించుకుంటే అన్నింట్లో విజయం సాధిస్తారని నమ్ముతారు.
Also Read: Dussehra 2022 Wish: విజయదశమి శుభాకాంక్షలు ఇలా SMS, Whatsapp ద్వారా మీ స్నేహితులకు తెలియజేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dussehra 2022: శ్రీ రాజరాజేశ్వరిదేవిగా అమ్మవారు.. దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు