Spiritual Importance of Thursday: గురువారం వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు...

Spiritual Importance of Thursday: హిందూ సాంప్రదాయంలో వారంలోని ఏడు రోజుల్లో ప్రతీ రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇందులో గురువారానికి ఉన్న ప్రాధాన్యత, ఆరోజు చేయాల్సిన, చేయకూడని పనులేంటో ఇక్కడ తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 11:33 PM IST
  • గురువారానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మీకు తెలుసా
  • ఆరోజు ఏ దేవుడిని పూజిస్తారో తెలుసా
  • ఆరోజు వివాహిత స్త్రీలు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి
  • అవేంటో ఇక్కడ తెలుసుకోండి
Spiritual Importance of Thursday: గురువారం వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయకూడదు...

Spiritual Importance of Thursday: హిందూ సాంప్రదాయం ప్రకారం గురువారం 'లక్ష్మీ నారాయణుడు'ని పూజిస్తారు. గురువారం లక్ష్మీ నారాయణుడిని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి. అదే సమయంలో గురువారం నాడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఒకవేళ గురువారం ఆ పనులు చేశారంటే.. అశుభాలన్నీ మీ చుట్టూ చేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు వివాహిత స్త్రీలు చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 

వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయొద్దు:

గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయవద్దు. అలాగే, చేతి గోళ్లు కత్తిరించడం, హెయిర్ కట్ చేసుకోవడం చేయొద్దు. అలా చేస్తే  వారి జాతకంలో బృహస్పతి బలహీనపడుతాడు. ఆ ఇంటి నుంచి లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది. అంతేకాదు, ఆ ఇంట్లో అరిష్టం మొదలవుతుంది. పేదరికం, కష్టాలు చుట్టుముడుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం వివాహిత స్త్రీల భర్తలు, పిల్లలపై గ్రహ ప్రభావం ఉంటుంది. అది స్త్రీలు చేసే పనులను బట్టి సత్ఫలితాలు లేదా దుష్పలితాలు ఇస్తుంది. కాబట్టి ఆరోజు స్త్రీలు గోళ్లు కత్తిరించడం, తలస్నానం చేయడం, జుట్టు కత్తిరించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. 

గురువారం దోష పరిహారాలు

బృహస్పతి అనుగ్రహం కోసం వివాహిత స్త్రీలు పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జాతకంలో గురు గ్రహ సంచారం బలపడుతుంది.

ఇంట్లోని శ్రీ మహా విష్ణువు చిత్రపటానికి పూజ చేయాలి.  పసుపు రంగు వస్తువులను విష్ణువుకు సమర్పించాలి. అరటిపండు నైవేద్యం పెడితే మంచిది.

ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. తద్వారా సకల దోషాలు తొలగి సిరి సంపదలు కలుగుతాయి. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Samantha Ruth Prabhu: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... త్వరలో సామ్ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్...

Also Read: TRS Rajyasabha Seats: రాజ్యసభ సీట్లను కేసీఆర్ బేరం పెట్టారా? సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News