Zodiac Signs: ఈ 5 రాశులవారు తమ భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు.. మీ రాశి కూడా ఇదేనా?

Zodiac signs: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, నక్షత్రాల ఆధారంగా వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారమే వారికి కలిసివచ్చే ఉద్యోగం, చదువులు వంటివి చూస్తారు. రాశిచక్రాల ప్రకారమే వ్యక్తికి సరైన జంటను వెతుకుతారు. ఈరోజు తమ భావొద్వేగాలను ఎప్పటికీ బయట పెట్టని 5 రాశులవారు ఉన్నారు. ఆ రాశులు ఏవి తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Feb 20, 2024, 12:33 PM IST
Zodiac Signs: ఈ 5 రాశులవారు తమ భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు.. మీ రాశి కూడా ఇదేనా?

Zodiac signs: జోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, నక్షత్రాల ఆధారంగా వ్యక్తి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారమే వారికి కలిసివచ్చే ఉద్యోగం, చదువులు వంటివి చూస్తారు. రాశిచక్రాల ప్రకారమే వ్యక్తికి సరైన జంటను వెతుకుతారు. ఈరోజు తమ భావొద్వేగాలను ఎప్పటికీ బయట పెట్టని 5 రాశులవారు ఉన్నారు. ఆ రాశులు ఏవి తెలుసుకుందాం.

వృశ్చిక రాశి..
ఈ రాశులవారు సాధారణంగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. చూడటానికి కూడా వృశ్చిక రాశివారు చాలా సైలెంట్ గా కనిపిస్తారు. వారి భావొద్వేగాలను బయటకు కనిపించనివ్వరు. మనస్పూర్తిగా వారి భావాలను ఎవరితోనూ పంచుకోరు. వృశ్చిక రాశివారి ఈ వైఖరి ఇతరులు వారిని అర్థం చేసుకోవడం కష్టతరం చేస్తుంది.

మకరరాశి..
మకరరాశివారు ఇతరులపై ఆధారపడరు. వారిపై వారికి పూర్తి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది.  అందుకే ఈ రాశివారికి ఏ బాధ కలిగినా ఇతరులతో పంచుకోరు. మకరరాశివారు భావొద్వేగానికి గురైనప్పుడు వాళ్లు ఎందుకు బాధపడుతున్నారో విషయం కూడా ఇతరులు తెలుసుకోవడం కష్టం. సాధారణంగా ఈ రాశివారు కష్టపడి పనిచేస్తారు. చూడటానికి కూడా ఈ వ్యక్తులు చాలా కూల్ గా, ప్రొఫెషనల్ గా కనిపించడానికి ప్రయత్నిస్తారు.

ఇదీ చదవండి: జయ ఏకాదశి రోజున అద్భుత పరిణామం.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..

కుంభరాశి..
ఈ రాశివారు ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వీళ్లు కూడా ఇతరులపై ఆధారపడరు. ఎమోషనల్ అయినప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి కనిపించనివ్వరు. సాధారణంగా వీళ్లు సాధకబాధలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అందుకే కుంభరాశివారు కూడా ఇతరులకు త్వరగా అర్థమవ్వరు.

కన్యరాశి..
కన్యరాశివారు లాజికల్ గా ఆలోచిస్తారు. ప్రయారిటీలకు విలువిస్తారు. దీంతో ఇతరులు చూడటానికి కూడా వీళ్లు కూల్ గా కనిపిస్తారు. ముఖ్యంగా కన్యరాశివారు తమ భావొద్వేగాలను ఇతరులతో పంచుకోరు.  ఈ రాశివారికి తమపై పూర్తి నియంత్రణ ఉండటానికి ఇలా ఎమోషన్స్ ఇతరులను చూడనివ్వకుండా దాచిపెడతారు.

ఇదీ చదవండి: వైష్ణోదేవి ఆలయం సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? కానీ, ఇవి ఉంటేనే వెళ్లగలరు..

మీనరాశి..
మీనరాశివారు సాధారణంగా దయ, సానుభూతి ఎక్కువగా ఉంటుంది. కానీ, ఈ రాశివారు తమ భావొద్వేగాలను బయటపడనివ్వరు. ఎంత బాధలో ఉన్నా ఇతరులతో నవ్వుతూ మాట్లాడతారు. ఇలా చేయడం వల్ల ఈ రాశివారి భావొద్వేగాలను ఇతరులు కనిపెట్టడం కష్టతరం అవుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News