Mercury Transit 2023: కొత్త సంవత్సరంలో భద్ర రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బేడబ్బు! నోట్ల కట్టలు లెక్కపెట్టలేక విసుగొస్తుంది

These 3 Zodiac Signs will get huge money in New Year due to Bhadra Raj Yoga 2023. బుధ గ్రహ సంచారాల కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే 'భద్ర రాజయోగం' ఏర్పడనుంది. ఈ రాజయోగం 5 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 20, 2022, 08:15 AM IST
  • కొత్త సంవత్సరంలో భద్ర రాజయోగం.
  • ఈ 3 రాశుల వారికి డబ్బేడబ్బు
  • లెక్కపెట్టలేక విసుగొస్తుంది
Mercury Transit 2023: కొత్త సంవత్సరంలో భద్ర రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బేడబ్బు! నోట్ల కట్టలు లెక్కపెట్టలేక విసుగొస్తుంది

These 3 Zodiac Signs will get Unexpected money in New Year 2023 due to Bhadra Raj Yoga 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలను బుధ గ్రహం ఇస్తుంది. 2022 డిసెంబరు 31న ధనుస్సు రాశిలో తిరోగమనంలో బుధ గ్రహం సంచరిస్తుంది. 2023 జనవరి 18న ప్రత్యక్షంగా మారి.. ఫిబ్రవరి 7న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధ గ్రహ సంచారాల కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలోనే 'భద్ర రాజయోగం' ఏర్పడనుంది. ఈ రాజయోగం 5 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. భద్ర రాజయోగం 2022 డిసెంబర్ చివరి రోజుల నుంచి  2023 ఫిబ్రవరి వరకు 5 రాశుల వారికి గొప్పగా ఉండనుంది. 

మేషం: 
బుధ సంచారం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది. ప్రతి పనిలో విజయాన్ని సాదితారు. చదువులో, వృత్తిలో భారీ లాభాలుంటాయి. కొంతమంది విదేశీ పర్యటనలకు వెళ్లవచ్చు. ముఖ్యమైన పరీక్ష లేదా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.

మిథునం: 
మిథున రాశికి అధిపతి బుధ గ్రహం. కాబట్టి బుధ సంచారం వలన ఈ రాశి వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. దాంపత్య సుఖాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు వివాహం చేసుకోవచ్చు.

ధనుస్సు: 
బుధుడు తన రాశిని మార్చుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశించి ఫిబ్రవరి 7 వరకు అక్కడే ఉంటాడు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. పెట్టుబడికి ఇది మంచి సమయం. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. 

కుంభం:
బుధ రాశి మార్పు కుంభ రాశి వారికి మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందవచ్చు. వ్యాపారులకు లాభం చేకూరుతుంది. నోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు పెద్ద పదవిని పొందవచ్చు. 

మీనం: 
మీన రాశి వారికి బుధ సంచారం చాలా పురోభివృద్ధిని కలిగిస్తుంది. వృత్తి మరియు వ్యాపారానికి అద్భుతమైనది. కొత్త జాబ్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్తులకు ధనం ఉంటుంది. నోట్ల కట్టలు లెక్కపెట్టలేక విసుగొస్తుందిs. ఒప్పందాలను కుదుర్చుకుంటారు.

Also Read: కొత్త సంవత్సరంలో ఈ 5 రాశుల వారు చాలా అదృష్టవంతులు.. కెరీర్‌లో ఉన్నత స్థానం, భారీ ప్యాకేజీ!

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం రేట్లు ఇలా ఉన్నాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News