Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి నూతన సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం!

Leo, Sagittarius and Virgo zodiac signs to get Promotion and money in New Year. 2022 డిసెంబర్ 5న ధనుస్సు రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసిరానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 14, 2022, 02:00 PM IST
  • లక్ష్మీనారాయణ యోగం
  • ఈ 3 రాశుల వారికి అదృష్టమే
  • కొత్త సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం
Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి నూతన సంవత్సరంలో ప్రమోషన్‌తో పాటు ధనలాభం!

These 3 zodiac signs to get Promotion and money in New Year due to Laxmi Narayan Yoga 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలిక ప్రభావం అన్ని రాశుల వ్యక్తుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహాల గమనం వలన కొన్ని రాశుల వ్యక్తులు ప్రయోజనం పొందితే..  మరికొన్ని రాశుల వ్యక్తులు నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 2022 డిసెంబర్ 5న ధనుస్సు రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. ఈ శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కలిసిరానుంది. 

జ్యోతిషశాస్త్రం ప్రకారం ధనుస్సు రాశిలో బుధుడు మరియు శుక్రుడి కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది.  అంతేకాదు జీవితంలో అపారమైన విజయాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశిలో శుక్రుని సంచారం ఏ రాశుల వారికి కొత్త సంవత్సరం సంతోషాన్ని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సింహ రాశి:
లక్ష్మీనారాయణ యోగం కారణంగా సింహ రాశి వారి జీవితంలో చాలా విజయాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పెళ్లి కాని వారికి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ఎందుకంటే బుధుడు ఇప్పటికే ధనుస్సులో ఉన్నాడు. దాంతో ధనుస్సు  రాశి వారి జీవితంలో విజయ దశ ప్రారంభమవుతుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. సంతానోత్పత్తి కూడా పొందవచ్చు. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. జీవితంలో విజయం సాధిస్తారు.

కన్య రాశి:
లక్ష్మీనారాయణ యోగం కారణంగా లక్ష్మీదేవి కన్య రాశి వారిపై ప్రత్యేక దయ చూపుతుంది. అధిక డబ్బు చేతికి అందుతుంది. వృతి, ఉద్యోగ, వ్యాపారంలో విశేష లాభాలు ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: Sun Transit 2022: డిసెంబర్ 16న త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి పెద్ద వరం! పదవి, ధనం, ప్రేమ మీ సొంతం  

Also Read: Andrew Flintoff Accident: ఆసుపత్రిలో ఆండ్రూ ఫ్లింటాఫ్.. ప్రాణాపాయం లేదని తేల్చిన వైద్యులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News