Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తరువాత ఈ రాశులకు కనకవర్షం, కొన్ని రాశులకు తీవ్ర ఇబ్బందులు

Surya Guru Yuti 2023: సూర్యుడు, గురుడు రెండు గ్రహాలను జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్యం కలిగినవిగా భావిస్తారు. దానం, పుణ్యం, చదువు, జ్ఞానం, ధార్మిక పనులకు కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల యుతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 11, 2023, 06:35 AM IST
Surya Guru Yuti 2023: 12 ఏళ్ల తరువాత ఈ రాశులకు కనకవర్షం, కొన్ని రాశులకు తీవ్ర ఇబ్బందులు

సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. 2023 ఏప్రిల్ 22వ తేదీన బుద్ధి, వివేకానికి కారకుడైన గురుడితో కలిసి మేషరాశిలో యుతి ఏర్పర్చనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులకు అత్యంత శుభసూచకంగా మారి లాభాలు కల్గించనుంటే..ఇంకొన్ని రాశులకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఎందుకంటే 12 ఏళ్ల తరువాత ఈ రెండు రాశుల మహా సంయోగం ఏర్పడనుంది. సూర్యుడిని, గురుడిని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అత్యంత కీలకమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా గురు గ్రహాన్ని దానం-పుణ్యం, చదువు-జ్ఞానం, ఆధ్యాత్మిక విషయాలకు కారకుడిగా పిలుస్తారు. అలాంటి ఈ రెండు గ్రహాలు సంయోగం చెందితే దాని ప్రభావం కూడా వివిధ రాశులపై బలంగానే పడనుంది. 

ఏయే రాశులకు మంచి రోజులు

మేష రాశి

గురు, సూర్య గ్రహాల యుతి కారణంగా మేషరాశి జాతకులకు వ్యాపారం, ఉద్యోగంలో లాభం, వృద్ధి కలగనుంది. ఈ సందర్బంగా కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. అందులో అభివృద్ధి ఉంటుంది. ఈ యుతి ఆర్ధిక విషయాల్లో చాలా లాభం కల్గిస్తుంది. దాంతోపాటు కష్టపడినదానికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. 

మిధునరాశి

మిథున రాశి జాతకులకు ఊహించనివిధంగా ఆర్ధిక ప్రయోజనం కలగనుంది. ఒకవేళ ఎవరైనా భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకుంటే...చాలా మంచి సమయం. ఈ కాలంలో మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఒకవేళ మనస్సు పెట్టి పనిచేస్తే అభివృద్ధి కొత్త శిఖరాల్ని చేరుకుంటుంది. విద్యార్ధులకు విజయం లభిస్తుంది. 

తుల రాశి

గురు సూర్య గ్రహాల మహా సంయోగం తులా రాశి జాతకులకు లాభదాయకంగా ఉండనుంది. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి, ఆనందం కలుగుతుంది. తిండి వ్యవహారాలపై దృష్టి పెట్టి బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. దాంతోపాటు ఖర్చు, ఆదా విషయాలపై శ్రద్ధ అవసరం. ఈ మహా సంయోగం కారణంగా ఆదాయం పెరుగుతుంది. 

ఈ రాశివారికి ప్రతికూల ప్రభావం

వృషభ రాశి

మేషరాశిల సూర్య, గురు గ్రహాల యుతి కారణంగా పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈ సమయంలో మీరు కోపంగా ఉండవచ్చు. ఫలితంగా మీ గౌరవ ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పనిచేసేచోట సమస్యలు రావచ్చు.

కర్కాటక రాశి

ఈ సందర్భంగా అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఉత్పన్నం కావచ్చు. డబ్బులు నష్టపోతారు. అందుకే వీలైనంతవరకూ ఆర్ధిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృధా ఖర్చులకు పోకూడదు.

కన్యా రాశి

సూర్య గురు గ్రహాల యుతి కారణంగా తల్లి ఆరోగ్యం సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్య లక్షణాలన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమస్య తలెత్తితే..వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

Also read: Weekly Horoscope: వచ్చే వారం ఈ నాలుగు రాశుల వారికి డబ్బే డబ్బు.. ప్రమోషన్స్, కోర్టు కేసుల్లో విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News