Surya Grahan 2022: సూర్య గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పొరపాటు చేయకండి.. అది పుట్టబోయే పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది!

Surya Grahan effect on Pregnant Lady: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్యగ్రహణం ప్రజల జీవితాలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 01:02 PM IST
Surya Grahan 2022: సూర్య గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ పొరపాటు చేయకండి.. అది పుట్టబోయే పిల్లలపై పెను ప్రభావం చూపుతుంది!

Surya Grahan effect on Pregnant Lady: సూర్య గ్రహణ (Solar eclipse) సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందుకే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల, సూర్యగ్రహణం-చంద్రగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవిస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ ఇది ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సూర్యగ్రహణం-చంద్రగ్రహణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

గర్భిణీ స్త్రీలపై చెడు ప్రభావం
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో (Surya Grahan effect on Pregnant Lady) బయటకు వెళ్లకూడదని నమ్ముతారు. ఎందుకంటే ఇది వారి పుట్టబోయే బిడ్డపై ఇది చెడు ప్రభావం చూపుతుంది. వాస్తవానికి, సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇది సంభవించే సమయంలో అనేక అలలు ఉద్భవిస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈ హానికరమైన తరంగాలు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసినప్పటికీ, ఇది పుట్టబోయే బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అది కాకుండా, గ్రహణం సమయంలో, విశ్వంలో ప్రతికూల శక్తి స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది గర్భిణీ స్త్రీలకు అంత మంచిది కాదు. 

Also Read: Shani Amavasya 2022: శని అమావాస్య ఏ రోజు.. పూజా ముహూర్తం ఎప్పుడు.. శని గండం గట్టెక్కాలంటే ఏం చేయాలి..

ఈ విషయాలను గుర్తుంచుకోండి 
** గ్రహణ సమయంలో తలెత్తే ప్రతికూలతను నివారించడానికి, గర్భిణీ స్త్రీలు (Pregnant women) గ్రహణం సమయంలో ఇంటి లోపల శుభ్రమైన ప్రదేశంలో మంత్రాన్ని జపించాలి. దీంతో సానుకూలత పెరుగుతుంది. 'ఓం' జపం చేయడం మంచిది.
**  సూర్యగ్రహణం సమయంలో పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుంది. గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఏమీ తినకూడదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News