Sun Transit in Libra 2022: తులా రాశిలోకి సూర్యుడు.. హార్ట్ పేషెంట్స్ జాగ్రత్త సుమీ!

Surya Gochar 2022, Sun Transit in Libra on 17 October 2022. అక్టోబర్ 17న సూర్యుడు తుల రాశిలోకి ఎంటర్ అవుతాడు. సూర్య సంచారం కారణంగా తులా రాశి వారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 13, 2022, 09:27 AM IST
  • తులా రాశిలోకి సూర్యుడు
  • హార్ట్ పేషెంట్స్ జాగ్రత్త సుమీ
  • దుబారా ఖర్చులు ఆపకపోతే
Sun Transit in Libra 2022: తులా రాశిలోకి సూర్యుడు.. హార్ట్ పేషెంట్స్ జాగ్రత్త సుమీ!

Sun Transit in Libra on 17 October 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... సూర్యుని రాశి చక్రంలోని మార్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మార్పు మొత్తం 12 రాశులపై విభిన్న ప్రభావాలను చూపిస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు.. ప్రతి నెలా తన రాశిని మార్చుకుని ఓ నెల పాటు అక్కడే ఉంటాడు. ఈ క్రమంలోనే దీపావళి పండగకి వారం రోజుల ముందు (అక్టోబర్ 17) సూర్యభగవానుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. తులా రాశిలో సూర్యుడు ప్రవేశించడం వలన ఆ రాశిపై తీవ్ర ప్రభావం చూపనుంది. అవేంటో ఓసారి చూద్దాం. 

పనులలో జాప్యం:
అక్టోబర్ 17 తర్వాత తులా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో శ్రద్ధగా పని చేయాలి. నిబంధనలను ఉల్లంఘించకుండా.. ఎవరితోనూ వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పదోన్నతులు పొందబోయే తులా రాశి వారికి కొంత జాప్యం జరగవచ్చు. అయితే ఈ సమస్య ఒక నెల మాత్రమే ఉంటుంది. కాబట్టి ఓపికతో ఉండండి. మార్కెటింగ్ మరియు టూర్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు ఎక్కువ ప్రయాణం చేయవలసి ఉంటుంది. తులా రాశి పనులు మధ్యలో ఆగిపోవచ్చు. 

దుబారా ఖర్చులు ఆపకపోతే:
తులా రాశి వారు ఖర్చులపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సూర్యుని మార్పు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. దుబారా ఖర్చులు ఆపకపోతే.. ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చు. కుటుంబ సంతోషం తక్కువగా ఉంటుంది. అంతేకాదు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. బంధుమిత్రులు, పెద్దమనుషులతో వివాదాల వల్ల మానసిక వేదనకు గురవుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కోపం తెచ్చుకోకుండా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. 

హార్ట్ పేషెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి: 
తులా రాశిలోకి సూర్య సంచారం కాబట్టి.. తులా రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు. హార్ట్ పేషెంట్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం విషయంలో చాలా సమతుల్యత పాటించాలి. ఆయిల్ మరియు తీపి వినియోగాన్ని తగ్గించాలి. అధిక బరువు ఉన్నవారు శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. చాలా కాలంగా కంటి పరీక్ష చేయించుకోవాలనుకునే వారు ఖచ్చితంగా ఈ నెలలోనే చేయించుకోండి. మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.

కోపం తెచ్చుకోకూడదు:
తులా రాశి వారు మీ కంటే చిన్నవారితో సభ్యంగా ఉండాలి. అప్పుడే మీరు వారి నుంచి గౌరవాన్ని పొందగలరు. మనసుకు నచ్చిన పని చేయనందుకు చిన్నవారిపై కోపం తెచ్చుకోకూడదు. ప్రేమతో అర్థం చేసుకుని పని నేర్పించాలి. 

Also Read: God Father - Pawan Kalyan: ఆ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తే బాగుండేది: చిరంజీవి

Also Read: Rayudu Fight: యువ ప్లేయర్‌తో అంబటి రాయుడు వాగ్వాదం.. ఇక మారవా అంటూ ఫాన్స్ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News