Grah Gochar 2022: శని నక్షత్రంలో 3 శక్తివంతమైన గ్రహాల కలయిక... ఈ 3 రాశులవారిపై ధనవర్షమే ఇక..

Grah Gochar December 2022: ప్రస్తుతం వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ శని ఆధీనంలో ఉన్న అనూరాధ నక్షత్రంలో ఉన్నాయి. ఈ గ్రహాల స్థానం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 08:04 AM IST
  • వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు
  • కొన్ని రాశులవారికి శుభప్రదం
  • అందులో మీరున్నారేమో చూడండి
Grah Gochar 2022: శని నక్షత్రంలో 3 శక్తివంతమైన గ్రహాల కలయిక... ఈ 3 రాశులవారిపై ధనవర్షమే ఇక..

Surya Budh Shukra Gochar in Vrishchik Rashi: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వృశ్చికరాశిలో విజయం, గౌరవాన్ని ఇచ్చే సూర్యుడు, ధనాన్ని-జ్ఞానాన్ని ఇచ్చే బుధుడు మరియు డబ్బు-విలాసం, ప్రేమ-శృంగార శుక్రుడు ఉన్నారు. అంతేకాకుండా ఈ మూడు గ్రహాలు శని నక్షత్రమైన అనూరాధ నక్షత్రంలో ఉన్నాయి. వృశ్చికరాశికి కుజుడు అధిపతి. అంగార రాశిలో ఈ ప్రభావవంతమైన గ్రహాల కలయిక కొన్ని రాశులవారికి శుభప్రదం. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం (Cancer): అనూరాధ నక్షత్రంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఉండటం కర్కాటక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. పాత పెట్టుబడి లాభిస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. జీవితంలో సుఖాలు పెరుగుతాయి.

మకరం (Capricorn): అనురాధ నక్షత్రంలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఉండటం వల్ల మకరరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. 

కుంభం (Aquarius): అంగారక రాశిలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు కలిసి ఉండడం కుంభ రాశి వారికి వరం లాంటిది. ఈ సమయం వారికి అదృష్టం కలిగిస్తుంది. మీరు మీ పనులలో ఆశించిన విజయాన్ని పొందుతారు. చెడిపోయిన పని కూడా పూర్తవుతుంది.  కెరీర్‌లో పెద్ద విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభం పెరుగుతుంది. పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 

Also Read: Budh Gochar 2022: ధనుస్సు రాశిలో బుధుడు సంచారం... ఈ 5 రాశులవారి ఆదాయం పెరగడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News