Sun Transit Effect 2022: సూర్యుడు జూలై 16న కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గోచారం ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ప్రత్యేకించి ధనస్సు రాశిపై ఏ విధమైన ప్రభావం పడనుందో తెలుసుకుందాం..
జూలై 16వ తేదీన సూర్యుడు కర్కాటకరాశిలో ప్రవేశించడమే కాకుండా దాదాపు నెలరోజులు అక్కడే ఉంటాడు. సూర్యుడి రాశి మారడం ఇతర రాశులపై వేర్వేరుగా ప్రభావం పడనుంది. ముఖ్యంగా ధనస్సు రాశిపై ఎక్కువగా ప్రభావం కన్పించనుంది. ఆ ప్రభావమేంటి, ఆ రాశివారు ఏం చేయాలి, ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకుందాం.
సూర్యుడి రాశి మారడంతో ధనస్సు రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సూర్యుడి కర్కాటక రాశి ప్రవేశం కారణంగా ధనస్సు రాశివారు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసర వస్తువుల కొనుగోలు, అనవసర ఖర్చు చేయకూడదు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పులు బాధిస్తాయి. అలసిపోకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. అనవసరంగా ఉరుకులు పరుగులు చేయకూడదు. వాతావరణ మార్పును బట్టి..సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే జ్వరం, జలుబు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులు సమయానికి మందులు తీసుకోవడం, కోపాన్ని తగ్గించుకోవడం అలవాటు చేసుకోవాలి. పైల్స్ వ్యాధితో ఇబ్బందులు రావచ్చు. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు సరిచూసుకోకపోతే ఇతరత్రా వ్యాధులు దాడి చేయవచ్చు.
ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూనే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే సాధారణంగా మహిళలు ఆరోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ వహించరు. ఫలితంగా చిన్న చిన్న సమస్యలే పెరిగి పెద్దదౌతాయి. ఏమాత్రం చిన్న సమస్యలున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ప్రభుత్వ సంబంధిత విషయాల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం మంచిది కాదు. ప్రభుత్వానికి చెల్లించాల్సినవి ఏమైనా ఉంటే వెంటనే చెల్లించడం మంచిది. లేకపోతే చర్యలకు బలికావల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో ఏ విధమైన వివాదాలకు దిగకూడదు. ఈ సమయంలో సాధ్యమైనంతవరకూ శత్రుత్వం పెంచుకోకుండా చూసుకోవాలి. అనవసర విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలి.
Also read: Sravana masam 2022: శ్రావణంలో శివుడిని ఎలా పూజించాలి, శివుడి ఇష్టాలు, అయిష్టాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook