Sun Transit 2023: ఈ 4 రాశులవారికి గుడ్‌న్యూస్, రేపట్నించి వద్దంటే వచ్చి పడే డబ్బు

Sun Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాలన్నీ నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. ఖగోళంలో జరిగే గ్రహాల కదలికను జ్యోతిష్యంలో రాశి పరివర్తనంగా అభివర్ణిస్తుంటారు. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2023, 06:49 AM IST
Sun Transit 2023: ఈ 4 రాశులవారికి గుడ్‌న్యూస్, రేపట్నించి వద్దంటే వచ్చి పడే డబ్బు

Sun Transit 2023: గ్రహాల్లో రాజుగా సూర్యుడిని, రాజకుమారుడిగా బుధుడిని, న్యాయ దేవతగా శని గ్రహాన్ని పిలుస్తుంటారు. ఇలా ప్రతి గ్రహానికి ఒక్కొక్క అంశంతో ముడిచేస్తారు. ఈ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం వివిధ రాశులపై అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..

సూర్యుడు ఏడాదిలో వేర్వేరు రాశులల్లో గోచారం చేస్తుంటాడు. శుభానికి ప్రతీకగా భావించే సూర్యుడు మే 15వ తేదీన వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం ముఖ్యంగా 4 రాశులపై పడుతోంది. ఈ నాలుగు రాశులకు ఊహించని ధనలాభం కలగనుంది. మే 15 అంటే ర్పు ఉదయం 11 గంటల 32 నిమిషాలకు సూర్యుడు వృషభ రాశిలో గోచారం చేయనున్నాడు. సూర్యుడు ఎప్పుడు గోచారం చేసినా చాలా రాశులకు మహర్దశ పడుతుంటుంది. అదే విధంగా నెలరోజులపాటు ఈ నాలుగు రాశులవారికి దశ మారిపోనుంది. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంటుంది.

సూర్యుడి వృషభ రాశి ప్రవేశం కారణంగా కన్యా రాశివారికి ఆదాయపు మార్గాలు పెరుగుతాయి. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అమాంతంగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సహా తీర్ధయాత్రలు చేసే అవకాశాలున్నాయి. ఆర్ధికంగా ఏ విధమైన కష్టాలుండవు.

సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో కుంభ రాశి జాతకులకు ఊహించని లాభాలుంటాయి. విద్యార్ధులకు అత్యంత అనువైన సమయం. సూర్యుడు వృషభ రాశిలో ఉన్నంతవరకూ కొత్త ఇళ్లు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. ఇచ్చిన అప్పులు కూడా తిరిగి వస్తాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏ విధమైన ఇతర సమస్యలు పెద్దగా ఉండవు.

కర్కాటక రాశి జాతకులకు సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావంతో చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆర్ధిక పరిస్థితి అత్యంత పటిష్టంగా, బలంగా ఉంటుంది. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే ఆ ఆలోచన కూడా పూర్తి కాగలదు. ఎక్కడికెళ్లినా అంతా లాభమే కలుగుతుంది. సూర్యుడు ఈ రాశి జాతకుల కుండలికి అధిపతి అయినందున అంతా అనుకూల పరిణామాలే ఉంటాయి.

సూర్యుడి వృషభ రాశి ప్రవేశం సింహ రాశి జాతకులపై చాలా అనువుగా ఉంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కోలుకుంటారు. ముఖ్యంగా ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. బంగారం లేదా ఏదైనా కొత్త వస్తువుల కొనుగోలు ఉంటుంది. పెట్టుబడులకు సైతం ఇది అనువైన సమయంగా చెబుతారు.

Also read: Shani Vakri 2023: శని తిరోగమనం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్! మీ ఖజానా డబ్బుతో నిండడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News