Sun Transit 2022: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

Sun Transit 2022: సూర్యుడి మరో మూడు రోజుల్లో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అంటారు. సూర్యుడి సంచారం మకరరాశిపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 08:00 PM IST
  • మరో 3 రోజుల్లో రాశిని మార్చబోతున్న సూర్యుడు
  • మకరరాశి వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం
Sun Transit 2022: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

Sun Transit 2022: మరో మూడు రోజుల్లో సూర్యుడు తనరాశిని మార్చబోతున్నాడు.  జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి (Sun Transit in Cancer 2022) ప్రవేశించబోతున్నాడు. దాదాపు అక్కడే నెలరోజులపాటు ఉంటాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇలాంటి సమయంలో మకర రాశిపై సూర్యుడి సంచారం ఎలాంటి ప్రభావం చూపబోతుందో తెలుసుకుందాం. 

ఈ రాశి శ్రామికులు పూర్తి ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. జీఎస్టీ, విద్యుత్, నీటి బిల్లులకు సంబంధించి ఏవైనా బకాయిలుంటే సకాలంలో చెల్లించడం ద్వారా మీరు ఇబ్బందులు  పడకుండా ఉంటారు. మీరు ఏదైనా స్థలాన్ని కొనుగోలు చేసినట్లయితే దానికి సంబంధించిన పత్రాలను మీ వద్ద ఉంచుకోండి. మెడికల్ వ్యాపారం చేసేవారు లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడం మంచిది. 

వైవాహిక జీవితం బాగుండాలంటే...భాగస్వాముల ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలి. ఇద్దరు వాగ్వాదాలు పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ సానుకూల వాతావరణ ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి. 

కర్కాటక రాశిలో సూర్యుని సంచారం ఈ రాశి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మకర రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భార్య మరియు కొడుకు అనారోగ్యంతో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జలుబు, తలనొప్పి వంటి చిన్న చిన్న జబ్బులను నిర్లక్ష్యం చేయకండి. శ్రావణ మాసంలో మసాల పుడ్ తీసుకోకండి. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ముందుగా రిజర్వేషన్ చేసుకొని వెళ్లండి.  డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. 

Also Read: Ashadha Purnima 2022: ఆషాఢ పూర్ణిమ ఉపవాసం, పూజా విధానం, చంద్రోదయ సమయం 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News