Sun Transit 2023: మీన రాశిలో సూర్య గ్రహం సంచారం వల్ల ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవు! మీ రాశి ఉండే జాగ్రత్తలు తప్పని సరి..

Sun Transit 2023: మీన రాశిలో సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల చాలా రాశులవారు దుష్ప్రభావాలు బారిన పడుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి సమస్యల బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 10:07 AM IST
Sun Transit 2023: మీన రాశిలో సూర్య గ్రహం సంచారం వల్ల ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు తప్పవు! మీ రాశి ఉండే జాగ్రత్తలు తప్పని సరి..

Sun Transit 2023: సూర్య గ్రహం ఈ నెల 15న కుంభ రాశిలో నుంచి మీన రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారి జీవితాల్లో చాలా రకాల మార్పులు వచ్చాయి. అంతేకాకుండా అదే రాశిలో బృహస్పతి గ్రహం ఉండడం వల్ల మహాదశ ఏర్పడింది. దీని వల్ల చాలా రాశులవారిలో మార్పలు సంభవించాయి. అయితే ఈ  మీనరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల ఏయే రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు, దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మీనరాశిలో సూర్య సంచార ప్రభావాలు:
మార్చి 15న సూర్యుడు మీన రాశిలో సంచరించాడు. దీని కారణంగా బృహస్పతిపై ప్రభావం పడనుంది. దీని కారణంగా చాలా రాశులవారి జీవితంలో సమస్యలు తలెత్తే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సూర్య సంచారం వల్ల ఈ రాశువారికి నష్టాలు తప్పవు:
మేషం:

మీనరాశిలో సూర్యుని సంచారం మేషరాశి వారికి తీవ్ర దుష్ర్పభావాలను కలిగించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తప్పకుండా అనారోగ్య సమస్యల వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంటి వ్యాధులు, మానసిక రుగ్మతలు వస్తాయి. కాబట్టి తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మేష రాశివారు ఈ సంచారం వల్ల అహంకారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దీనిని తగ్గించుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

సింహ రాశి :
మార్చి 15 నుంచి సింహ రాశివారికి కూడా చిన్న చిన్న నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సూర్య సంచారం వల్ల ఈ రాశివారికి కూడా ఆరోగ్యంలో మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం అస్సలు వహించవద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో కోపాన్ని కూడా అదుపులో పెట్టుకోండి. అయితే వ్యాపారాల్లో పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే ద్రవ్య లాభాలు కూడా కలుగుతాయి.

కన్య:
సూర్యుని సంచారం కన్యారాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఈ సమయంలో అనవసరమైన టెన్షన్ కారణంగా వాదనలు కూడా జరగవచ్చు. మీన రాశిలోకి సూర్యుడు సంచారం చేశాడు కాబట్టి.. ఈ రాశివారు కూడా  ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.

మకరరాశి:
మకర రాశి వారికి సూర్య సంచారం తీవ్ర సమస్యలను తెచ్చిపెట్టొచ్చు. వీరికి ఈ క్రమంలో కోపం పెరిగి చిన్న పనులకే తీవ్ర నష్టాలను చవిచూసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇతరులతో సంబంధాల్లో మార్పులు రావొచ్చు. కాబట్టి తప్పకుండా ఒక నెల జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News