Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, పరిహారాలు తెలుసుకోండి

Sun Transit in leo 2022: సూర్యుడు సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవాన్ని మరియు ప్రతిష్టను ఇస్తాడు. అలాంటి సూర్యుడు నిన్న రాశిని మార్చాడు. దీని సంచారం ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుంది, నివారణ చర్యలు తెలుసుకోండి.     

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 18, 2022, 09:19 AM IST
Sun Transit 2022: సింహరాశిలో సూర్య సంచారం.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, పరిహారాలు తెలుసుకోండి

Sun Transit in leo 2022: నిన్న అంటే ఆగస్టు 17న సూర్యుడు 11నెలల తర్వాత తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఉదయం 7.14 గంటలకు ప్రవేశించాడు. సింహరాశిలో సూర్య సంచారం (Sun Transit in leo 2022) మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపింది, దాని నివారణ చర్యలు ఏమిటో తెలుసుకోండి. 

మేషరాశి (Aries): సింహరాశిలో సూర్యుని సంచారం మేషరాశివారి ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ సమయం మేషరాశివారికి అనుకూలంగా ఉంటుంది.
పరిహారం: చిన్న తోబుట్టువులకు ఎరుపు రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వండి.

వృషభరాశి (Taurus): వృషభ రాశి వారికి సూర్యుని సంచారం చాలా మేలు చేస్తుంది. వాహనం లేదా మరేదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి ఈ కాలం మంచిది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. ఆఫీసులో సహచరుల మద్ధతు లభిస్తుంది. 

మిథునరాశి (Gemini): ఈ రాశివారికి తోబుట్టువుల నుండి సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్లడం మంచిది.వీలైనంత సమయం మీ కుటుంబసభ్యులతో గడపండి. 
పరిహారం: ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటకరాశి (Cancer): కర్కాటక రాశి వారికి సూర్య సంచారం కొన్ని ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీ మాటలు ఎవరినైనా మానసికంగా బాధపెట్టవచ్చు. అయితే, ఆర్థిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల సపోర్టు లభిస్తుంది.  
పరిహారం: ఆవుకు రొట్టెతో తినిపించండి

సింహరాశి (Leo): సూర్యుడు సింహరాశిలోకే ప్రవేశించాడు కాబట్టి ఈ రాశివారికి అనుకూలంగానే ఉంటుంది.  ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. యోగా, వ్యాయామం, ధ్యానం చేయడం మంచిది. ఈ సమయంలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.  
పరిహారం: ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యారాశి (Virgo): కన్యా రాశి వారికి సూర్య సంచారాలు మేలు చేసే అవకాశం ఉంది. మీరు ఇతరుల నుండి ప్రయోజనాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. ఆరోగ్య పరంగా కూడా బాగుంటారు. 
పరిష్కారం: మీ జేబులో లేదా పర్సులో ఎర్రటి రుమాలు ఉంచండి.

తుల రాశి (Libra): సూర్యుని సంచారం తుల రాశి వారికి ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.  
పరిహారం: ఆవుకు బెల్లం తినిపించండి.

వృశ్చిక రాశి (Scropio): వృశ్చిక రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కష్టపడి పనిచేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.  
పరిహారం: ఇంటి నుండి బయలుదేరే ముందు తండ్రి ఆశీర్వాదం తీసుకోండి.

ధనుస్సు(Sagittarius): సూర్యుని సంచారం ఈ రాశి విద్యార్థులకు బలం చేకూరుస్తుంది. విదేశాలలో చదువుకోవాలని అనుకునేవారికి ఇదే మంచి సమయం. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలకు వెళ్లడం శుభప్రదం
పరిహారం: ఎర్ర గులాబీ రేకులను తీసుకుని ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి సమర్పించండి.

మకరరాశి (Capricron): మకర రాశి వారికి సూర్యుని ప్రయాణం సవాలుతో కూడుకున్నది. ఈ కాలంలో శారీరక లేదా మానసిక ఇబ్బందులకు గురికావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. దుబారా ఖర్చులు చేయకండి. 
పరిహారం: మంగళవారం ఆంజనేయుడి ఆలయానికి బెల్లం దానం చేయండి.

కుంభరాశి (Aquarius): కుంభ రాశి వారు ఈ సూర్యుని సంచారం వల్ల వారి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి.  
పరిహారం: హనుమాన్ కు నైవేద్యం పెట్టండి.

మీనరాశి (Pisces): సూర్యుని సంచారం మీన రాశి వారికి ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ రాశి విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. కెరీర్ లో సానుకూల ఫలితాలు ఉంటాయి. 
పరిహారం- ప్రతి రోజూ ఉదయం గాయత్రీ మంత్రాన్ని జపించండి.

Also Read: మరో 3 రోజుల్లో బుధుడు రాశి మార్పు... ఈ 3 రాశుల వారికి చెడు రోజులు మెుదలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News