Shadashtak Yoga: సూర్య-రాహు అశుభకర యోగం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం..

Shadashtak Yoga: సూర్యుడు వచ్చే వారంలో తన రాశిని మార్చబోతున్నాడు. అంతేకాకుండాసూర్యుడు, రాహు కలిసి షడష్టక యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది అశుభకరమైన యోగం భావిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2022, 01:04 PM IST
Shadashtak Yoga: సూర్య-రాహు అశుభకర యోగం... ఈ రాశులకు అపారమైన ప్రయోజనం..

Shadashtak Yoga 2022 Effect: సూర్యుడు... శక్తి, గౌరవం, తండ్రి, ఉన్నత స్థానం, అధికారానికి కారకుడు. ఆదివారం సూర్యనారయణుడిని పూజిస్తారు. సెప్టెంబరులో సూర్యుని రాశి మార్పు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. సూర్యభగవానుడు సెప్టెంబరు 17, ఉదయం 7:11 గంటలకు తన సొంత రాశి అయిన సింహరాశి నుండి కన్యారాశిలోకి (Surya gochar in leo 2022) ప్రవేశిస్తాడు. సూర్యుడు నెలరోజులపాటు అక్కడి ఉండి.. అక్టోబరు 17న తులరాశిలోకి ప్రవేశిస్తాడు.

రాహువు-సూర్యుడు షడష్టక యోగం..
సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు మేషరాశిలో రాహువుతో షడాష్టక యోగాన్ని ఏర్పరుస్తాడు. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని అశుభకరమైన యోగం పరగణిస్తారు. రాహు, సూర్యుల కలయిక కారణంగా కొన్ని అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. ఇంటి కుటుంబ పెద్ద చనిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడటం, దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తలెత్తడం వంటి సమస్యలు ఏర్పడతాయి. 

ఈ రాశులకు శుభ ఫలితాలు
మేషరాశి (Aries): సూర్యుని సంచారం ఈ రాశి యెుక్క ఆరో ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారి పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈసమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు రాణిస్తారు. 
కర్కాటకం (Cancer): కన్యారాశి ద్వారా సూర్యుడు ఈ రాశి యెుక్క మూడో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీ ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అదృష్టంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. 
వృశ్చిక రాశి (Scorpio): సెప్టెంబరు 17న సూర్యుడు ఈ రాశి నుండి 11వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం మెండుగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read: Shani Margi 2022: మకరరాశిలో శని సంచారం.. అక్టోబరు 23 నుంచి ఈరాశుల వారికి అంతులేని ధనం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News