Surya-Shani Yuti 2023: సూర్య-శని యుతి.. ఈ రాశుల జీవితం అధోగతి.. ఇందులో మీరున్నారా?

Sun and Saturn conjunction 2023: త్వరలో కుంభరాశిలో తండ్రీ కొడుకులు కలవనున్నారు. సూర్య-శని సంయోగం వల్ల కొన్ని రాశులవారు సమస్యలు ఎదుర్కోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 11:45 AM IST
Surya-Shani Yuti 2023: సూర్య-శని యుతి.. ఈ రాశుల జీవితం అధోగతి.. ఇందులో మీరున్నారా?

Surya-Shani Yuti 2023:  సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సూర్యుని రాశిలో మార్పు కొందరికి శుభం, కొందరికి అశుభం. ఫిబ్రవరి 13, 2023న, సూర్యుడు మకరరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే తన సొంతరాశి అయిన కుంభంలో శనిదేవుడు సంచరిస్తున్నాడు. మకరంలో రెండు శత్రు గ్రహాల కలిసి ఉండటం వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కుంభం (Aquarius): కుంభరాశిలో తండ్రీకొడుకల కలయికవల్ల ఈరాశివారికి సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులకు ఈ సమయం అనుకూలం కాదు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు తలెత్తుతాయి. ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం కాదు. 
వృశ్చికం (Scorpio): రెండు శత్రు గ్రహాలు కలిసి ఉండటం కూడా వృశ్చిక రాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈసమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో సహోద్యోగులతో సంబంధాలు చెడిపోవచ్చు. 
సింహం (Leo): ఫిబ్రవరి 13న సూర్యుని సంచారం సింహ రాశి వారికి అశుభం. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీ పెళ్లి చెడిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. కొత్త పనిని ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. 
కర్కాటకం (Cancer):  సూర్యుడు-శని సంయోగం కర్కాటక రాశి వారి కష్టాలను పెంచుతుంది. వీరి ఆదాయం  తగ్గుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారులు ఈ సమయం అంతగా కలిసి రాదు. ఇతరులతో చర్చకు దూరంగా ఉండండి. 

Also Read: Tilkund Chaturthi 2023: తిల్కుండ్ చతుర్థి నేడే.. ఇవాళ గణేశుడికి ఈ పరిహారం చేస్తే మీకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News