Janmashtami 2022: శ్రీకృష్ణుడి జన్మాష్టమి తేదీ, ముహూర్తం ఎప్పుడు, ఎలా పూజలు చేయాలి

Janmashtami 2022: శ్రావణ మాసం తరువాత వచ్చేది భాద్రపదం. ఈ నెలలోనే జన్మాష్టమి వేడుక ఉంటుంది. ఈ రోజుల వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. ఈసారి జన్మాష్టమికి ప్రత్యేకమైన కలయిక ఉంది.   

Last Updated : Jul 12, 2022, 04:03 PM IST
Janmashtami 2022: శ్రీకృష్ణుడి జన్మాష్టమి తేదీ, ముహూర్తం ఎప్పుడు, ఎలా పూజలు చేయాలి

Janmashtami 2022: శ్రావణ మాసం తరువాత వచ్చేది భాద్రపదం. ఈ నెలలోనే జన్మాష్టమి వేడుక ఉంటుంది. ఈ రోజుల వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. ఈసారి జన్మాష్టమికి ప్రత్యేకమైన కలయిక ఉంది. 

హిందూమతంలో శ్రీకృష్ణుడి జన్మాష్టమి అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు వ్రతం ఆచరిస్తారు. శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. భాద్రపదంలోని కృష్ణపక్షం అష్టమి నాడు శ్రీకృష్ణుడి జన్మాష్టమి ఉంది. ఈసారి జన్మాష్టమి ఆగస్టు 18 గురువారం నాడు వస్తోంది. ధార్మిక గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు భాద్రపదం అష్టమి తిధి రోహిణీ నక్షత్రంలో పుట్టాడు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజున ఇంట్లో, ఆలయాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈసారి జన్మాష్టమి నాడు ప్రత్యేక కలయిక ఏర్పడనుంది. అందుకే శుభముహూర్తం ప్రకారమే పూజలు చేయాలి. ఆ ప్రత్యేక కలయిక ఏంటో చూద్దాం.

ఈసారి జన్మాష్టమి ఏర్పడనున్న ప్రత్యేక కలయిక ముహూర్తంలో పూజలు చేయడం వల్ల శ్రీకృష్ణుడు ప్రసన్నుడై కటాక్షం ఉంటుందని అంటారు. ఈసారి ఆగస్టు 17 రాత్రి 8 గంటల 56 నిమిషాల్నించి ఆగస్టు 18వ తేదీ రాత్రి 8 గంటల 41 నిమిషాల వరకూ వృద్ధి యోగం ఉంటుంది. అటు ఆగస్టు 18వ తేదీ 12 గంటల 5 నిమిషాల్నించి  12 గంటల 56 నిమిషాల వరకూ అభిజీత ముహూర్తముంది. అటు ఆగస్టు 18వ తేదీ రాత్రి 8 గంటల 41 నిమిషాల్నించి ఆగస్టు 19 రాత్రి 12 గంటల 59 నిమిషాలవరకూ ధృవ ముహూర్తముంది. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజు విధి విధానాలతో పూజలు చేయడం వల్ల శ్రీ కృష్ణుడి కటాక్షం లభిస్తుంది. ఈరోజున శ్రీకృష్ణుడి శృంగారంతో అష్టగంధ చందనం, అక్షింతలు, తిలకం దిద్దాలి. ఆ తరువాత వెన్న, పట్టికబెల్లం సమర్పించాలి. ప్రత్యేక మంత్రాల్ని పఠించాలి. ఆ తరువాత చేతిలో పూలు , బియ్యం తీసుకుని గుమ్మంపై పెట్టి..శ్రీకృష్ణుడిని ఆహ్వానించాలి. శ్రీ కృష్ణుడికి ఇష్టమైన వైజయంతీ పూలను అర్పించాలి. ప్రసాదంలో పంచామృత భోగం తప్పకుండా ఉండాలి. దాంతోపాటు తులసీపత్రం అర్పించడం మర్చిపోకూడదు. ఈ రోజున సాత్విక భోజనం శ్రీకృష్ణుడికి పెట్టాలి. 

Also read : Shani Transit: నేడు మకర రాశిలోకి శని ప్రవేశం... ఈ 3 రాశుల వారికి ఇక అంతా శుభమే...

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News