Surya Grahan 2022: రేపే సూర్యగ్రహణం... భారత్‌లో కనిపిస్తుందా? సూర్యుని అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి

Solar eclipse 2022: సూర్యగ్రహణం ఏర్పడుతుదంటే చాలు.. ప్రజలు భయాందోళనకు గురవుతారు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, సూర్య గ్రహణం ప్రజలు జీవితాలపై చెడు ప్రబావం చూపుతుంది. రేపు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 10:59 PM IST
Surya Grahan 2022: రేపే సూర్యగ్రహణం... భారత్‌లో కనిపిస్తుందా? సూర్యుని అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి

Surya Grahan 2022 Date and Time in India: రేపే (ఏప్రిల్ 30, 2022) సూర్యగ్రహణం (Surya Grahan 2022). జ్యోతిష్యశాస్త్ర ప్రకారం దీనిని అశుభంగా భావిస్తారు. దీని గురించి పెద్దగా టెన్షన్ పడకండి. ఎందుకంటే విక్రమ్ సంవత్ 2079 కింద 4 గ్రహణాలు వస్తాయి. ఇందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఉంటాయి. భారతదేశంలో ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం మాత్రమే ప్రభావం చూపుతాయి. ఈరోజు మనం రేపటి సూర్యగ్రహణం గురించి మాట్లాడుకుందాం. 

మేషరాశిలో గ్రహణం 
30 ఏప్రిల్ 2022, శనివారం నాడు వైశాఖ కృష్ణ అమావాస్య రోజున మేషరాశిలోని అశ్వినీ నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది విని మేష రాశి వారు చాలా కలత చెందుతారు కానీ భారతదేశంలో నివసించే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. 

ఈ సూర్యగ్రహణం ప్రభావం చూపే ప్రదేశాలు: పశ్చిమ-దక్షిణ, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్, ఫాక్లాండ్, అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే, పరాగ్వే, బొలీవియా మొదలైనవి. సాగర్ పంచాంగ్ ప్రకారం, ఖండ్‌గ్రాస్ సూర్యగ్రహణం ఏప్రిల్ 30వ తేదీ అర్ధరాత్రి 12:15 గంటలకు ప్రారంభమవుతుంది, గ్రహణం మధ్యాహ్నం 2.12 గంటలకు సంభవిస్తుంది మరియు మే 1వ తేదీ ఉదయం 4:08 గంటలకు ముగుస్తుంది. 

ఈ విషయాలను గుర్తుంచుకోండి
**గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి పూజలన్నీ సాధారణ రోజుల మాదిరిగానే చేయాలి. 
** గ్రహణ సమయంలో, మీరు భగవంతునిపై దృష్టి కేంద్రీకరించేటప్పుడు ఏదైనా మంత్రాన్ని జపించవచ్చు. ఇది దేవుని పట్ల ఆధ్యాత్మిక వైఖరి.
** ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, గ్రహణ కాలంలో సాయంత్రం వినోదం చేయకూడదు. భారతదేశంలో గ్రహణం కనిపించనప్పటికీ, ఇప్పటికీ సినిమాలు చూడకూడదు, సంగీతం వినకూడదు, నృత్యం చేయకూడదు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే, మీ దేవుడు ఇబ్బందుల్లో ఉన్నాడు.
** ఏదైనా రాశికి చెందిన స్త్రీ గర్భవతి అయితే, ఆమె గ్రహణం గురించి అస్సలు భయపడకూడదు. అలాగే వారు ఎటువంటి చర్యలు తీసుకోనవసరం లేదు. కేవలం ధ్యానం మరియు భగవంతుని జపం మాత్రమే చేయండి. అది ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది.
**గ్రహణ సమయంలో నిద్రపోవడం మానుకోవాలి, ఎందుకంటే భగవంతునిపై సంక్షోభం ఉంది. మనం నిద్రపోవడం సరైనది కాదు.
** మీకు సూర్యభగవానుని పట్ల భక్తి ఉంటే తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది. సూర్యుడు గ్రహాలకు రాజు, కాబట్టి వాటిని సంతోషంగా ఉంచడం అవసరం.

Also Read: Solar Eclipse April 2022: సూర్యగ్రహణం రోజున చేయాల్సినవి, చేయకూడని పనులేంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News