Venus Transit 2022: శుక్రుడి సంచారం.. డిసెంబర్ 5 నుంచి వీళ్ల అదృష్టం ప్రకాశించడం పక్కా..

Venus Transit 2022: వచ్చే నెలలో శుక్రుడు ధనుస్సు రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి యెుక్క రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు లాభడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 04:19 PM IST
  • ప్రేమ దేవుడు శుక్రుడి సంచారం
  • ఈ 3 రాశులవారికి శుభప్రదం
  • ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2022: శుక్రుడి సంచారం.. డిసెంబర్ 5 నుంచి వీళ్ల అదృష్టం ప్రకాశించడం పక్కా..

Venus Transit 2022: ప్రేమ, శృంగారం, డబ్బు, అందం మరియు కళల గ్రహంగా శుక్రుడిని భావిస్తారు. డిసెంబరు 5న శుక్రుడు ధనుస్సు రాశిలోకి (Venus transit in Sagittarius 2022) సంచరించాడు. ఆ తర్వాత డిసెంబరు 29న శుక్రుడు మకరరాశిలో ప్రవేశించనున్నాడు. ఈ గ్రహం 23 రోజులపాటు ఒకేరాశిలో ఉండనున్నాడు. ఈ శుక్ర సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈ మూడు రాశులకు శుభప్రదం
మేషం (Aries): మేష రాశి వారికి శుక్రుడు అదృష్ట గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి ధనయోగం కలుగుతుంది.జ్యోతిష్యం నేర్చుకునే వారికి కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తోంది. ఖర్చులను అదుపులోకి ఉంచుకుంటే మీకు మేలు జరుగుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు శుభప్రదంగా ఉంటుంది. 

సింహం (Leo): శుక్రుడు సింహరాశి యొక్క ఐదవ ఇంటి గుండా ప్రయాణించబోతున్నాడు. దీంతో మీరు ఇతరులను ఆకర్షిస్తారు. మీడియా, ఫ్యాషన్ రంగానికి చెందిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త జాబ్ ను పొందే అవకాశం ఉంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. ఆర్థికంగా మీరు లాభపడతారు. 

వృశ్చికం (Scorpio): శుక్రుని సంచారం వృశ్చిక రాశి యెుక్క రెండో ఇంట్లో జరుగబోతుంది. దీంతో మీరు విదేశాలకు వెళ్లాలనుకునేవారికి కోరిక నెరవేరుతుంది. వ్యాపారులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. భర్తలు భార్యలు కోరికలు నెరవేరుస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మెుత్తానికి ఈ టైం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Budh Gochar 2023: వచ్చే ఏడాది నుంచి ఆ 3 రాశులకు ఖజానా నిండటం ఖాయం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News