Shukra Shani Yuti: రాహు-శుక్ర సంయోగం వల్ల ఈ 30 రోజులు ఏం చేసినా విజయాలు సాధించడం ఖాయం!

Shukra Shani Yuti: రాహు-శుక్ర సంయోగ ప్రభావం చాలా రాశులవారిపై పడే ఛాన్స్‌ఉందని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో అన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో విజయాలు కూడా సాధిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2023, 09:47 AM IST
Shukra Shani Yuti: రాహు-శుక్ర సంయోగం వల్ల ఈ 30 రోజులు ఏం చేసినా విజయాలు సాధించడం ఖాయం!

Shukra Shani Yuti: శుక్ర గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో మహిమాన్వితమైన శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఇది మీ జాతకంలో మంచి దశలో ఉంటే మీకు జీవితాంతం ఐశ్వర్యం, లాభం, గౌరవం, ప్రేమకు డోకా ఉండదని శాస్త్రంలో పేర్కోన్నారు. అయితే మీ జాతకంలో శుక్ర గ్రహంతో రాహువు లేదా కుజుడు వంటి ఏదైనా గ్రహాల కలయిక ఉంటే తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  అయితే కొన్ని రాశులవారి జీవితాల్లో 12 మార్చి నుంచి తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ క్రమంలో మేషరాశిలో శుక్రుడు, రాహువు కలయిక జరగబోతోంది. దీంతో పలు రాశులవారి జీవితాల్లో అనుకోని సంఘటనలు జరిగే ఛాస్స్‌ ఉంది. అంతేకాకుండా వీరు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. అయితే ఏయే రాశువారి జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల మీద రాహు-శుక్ర సంయోగ ప్రభావం:
మేషరాశి:

రాహు-శుక్రుల కలయిక వల్ల మేష రాశి వారు ఎవరైనా ఆకర్షణకు లోనయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా రొమాంటిక్‌గా మారే అవకాశాలున్నాయి. ప్రేమ విషయంలో మీరు గందరగోళానికి గురికావచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వృషభం:
ఈ రెండు గ్రహాల సంయోగ ప్రభావం వల్ల ఏదైనా కొత్త సంబంధానికి సంబంధించి అపార్థానికి లోనవుతారు. ఈ క్రమంలో మీకు మైడ్‌ నియంత్రణలో కూడా ఉండదు. కాబట్టి మీ కొన్ని పాత జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని బాధపెట్టే ఛాస్స్‌ ఉంది. అంతేకాకుండా మీ పాత ప్రియురాలు మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తుంది.

మిధునరాశి:
మిథునరాశి వారికి రాహువు, శుక్రుల సంయోగం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా కొత్త సంబంధాల వల్ల జీవితాల్లో తీవ్ర మార్పలు జరిగే అవకాశాలున్నాయి. ప్రేమ జీవితంలో విభేదాలు తొలగిపోయి, ప్రేమ పెరిగే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి రెండు గ్రహాల కలయికల వల్ల కొన్ని ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కార్యాలయంలో ఆకర్షిణకు గురయ్యే ఛాన్స్‌ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఎవరితోనైన ప్రేమలో పడే ఛాస్స్‌ కూడా ఉంది.

సింహరాశి:
మేషరాశిలో రాహువు, శుక్రుల కలయిక వల్ల ఈ రాశివారికి ఫలప్రదంగా ఉండబోతోంది. ప్రేమ జీవితంలో విజయం సాధించడానికి వీరు అదృష్టం పొందుతారు. అంతేకాకుండా ఈ రాశివారు ప్రియమైన వారితో రొమాంటిక్ ట్రిప్‌కు వెళ్తారు. దీంతో మానసిక ఆనందం పొందుతారు.

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News