Shukra Gochar December: ధనస్సు & మకరరాశిలో సంచరించనున్న శుక్రగ్రహం.. ఆ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Shukra Gochar 2022: డిసెంబరు నెలలో శుక్రుడు రెండు సార్లు తన రాశిని మార్చనున్నాడు. దీంతో కొన్ని రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 07:57 PM IST
  • ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది
  • డిసెంబరు నెలలో శుక్రుడి సంచారం
  • ఈ రాశులకు అపారమైన ప్రయోజనం
Shukra Gochar December: ధనస్సు & మకరరాశిలో సంచరించనున్న శుక్రగ్రహం.. ఆ 3 రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Shukra Gochar December 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, డిసెంబరులో కొన్ని ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ప్రేమ, శృంగారం, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు డిసెంబరులో రెండు సార్లు తన స్థానాన్ని మార్చనున్నాడు. శుక్ర గ్రహం ధనస్సు మరియు మకరరాశిలో సంచరించనున్నాడు. శుక్ర సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

కుంభం (Aquarius): శుక్ర సంచారం ఈరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి యెుక్క 11వ ఇంట్లో శుక్రుని సంచారం జరగబోతుంది. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి వ్యాపారస్తులు లాభపడతారు. డబ్బును ఆదా చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. 

వృశ్చికం (Scorpio): డిసెంబరులో శుక్రుని సంచారం వృశ్చికరాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యెుక్క రెండో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకుంటే మీకు లాభం ఉంటుంది. 

సింహం (Leo): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రాశి వారికి శుక్రుని సంచారం అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. మీ జాతకంలోని ఐదో ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో సంతానం లేని దంపతులు పిల్లలను పొందే అవకాశం  ఉంది. పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.  

Also Read: Paush Amavasya 2022: పుష్య అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News