Venus Transit 2022: తులారాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ 5 రాశులవారికి కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో భారీ లాభం...

Venus Transit 2022: రెండు రోజుల కిందట శుక్రుడు తులరాశిలో సంచరించాడు. దీంతో 5 రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2022, 12:15 PM IST
Venus Transit 2022: తులారాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ 5 రాశులవారికి కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో భారీ లాభం...

Venus Transit 2022: దీపావళికి ముందు అక్టోబరు 18న శుక్రుడు కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి ప్రవేశించాడు. ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. తులరాశిలో శుక్రుడి సంచారం (Venus Transit in Libra 2022) 5 రాశులవారికి ఆర్థికంగా లాభిస్తుంది. అంతేకాకుండా వీరు కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries): శుక్ర సంచారం శుభప్రభావం కారణంగా మేషరాశి వారు వృత్తిలో గొప్ప పురోగతిని సాధిస్తారు. అధికారులో మీ సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. అంతేకాకుండా బిజినెస్ విస్తరిస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. శుక్రవారం నాడు 7 రకాల ధాన్యాలను దానం చేయడం ద్వారా మీకు మేలు జరుగుతుంది. 
వృషభరాశి (Taurus): ఈ శుక్రుని సంచారం మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలను తెస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. దీపావళి నాడు మీరు ఖరీదైన బహుమతులు పొందుతారు. డబ్బును ఆదా చేయడం మెుదలుపెడతారు. వైవాహిక జీవితంలో గొడవలకు దూరంగా ఉండటం మంచిది. 
కర్కాటక రాశి (Cancer): కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం చాలా శుభ ఫలితాలను తెస్తుంది. మీ ఇంటి అలంకరణ కోసం ఖర్చు పెడతారు. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. ప్రేమ మరియు శృంగార పరంగా కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.  నివారణగా ప్రతి శుక్రవారం బావిలో పప్పు మరియు పసుపు వేయాలి.

కన్యారాశి (Virgo): శుక్ర సంచారం వల్ల కన్యారాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది. మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పనితీరుతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. చిక్కుకుపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. దీనికి పరిష్కారంగా ప్రతి శుక్రవారం పేదవారికి పంచదార, బెల్లం వంటి వస్తువులను దానం చేయండి. 
తులారాశి (Libra): శుక్రుడు సంచారం ఈ రాశిలోనే జరుగుతుంది కాబట్టి తులరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మునుపటి కంటే ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు. మీకు అదనపు ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా, అది భవిష్యత్తులో మీకు మంచి రాబడిని ఇస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ప్రేమ వ్యవహారాల పరంగా ఈసమయం అనుకూలంగా  ఉంటుంది. నివారణగా ప్రతి రోజు ఒక నల్ల ఆవు లేదా గుర్రానికి తేనె తినిపించండి.

Also Read: Solar Eclipse 2022: మరో 5 రోజుల్లో సూర్యగ్రహణం.. హైదరాబాద్​ లో ఎన్ని నిమిషాలు కనిపిస్తుందో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News