Grah Gochar 2022: త్వరలో వృశ్చికరాశిలో 3 గ్రహాల సంచారం.. ఈ 4 రాశులకు జాక్ పాట్ ఖాయం..

Rashi Parivartan 2022: ఈ నెలలో 3 పెద్ద గ్రహాలు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాయి. దీంతో నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 09:55 AM IST
Grah Gochar 2022: త్వరలో వృశ్చికరాశిలో 3 గ్రహాల సంచారం.. ఈ 4 రాశులకు జాక్ పాట్ ఖాయం..

Zodiac change in November 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. వీటి ప్రభావం అందరిపై ఉంటుంది. ఈ నెలలో 3 గ్రహాలు వరుసగా వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. శుక్రుడు నవంబర్ 11న, బుధ గ్రహం 13న, సూర్యగ్రహం 16న వృశ్చికరాశిలో సంచరించనున్నాయి. ఒకే రాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల ఈ నెలలో నాలుగు రాశులవారు అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

వృశ్చికం (Scorpio): మూడు పెద్ద గ్రహాలు ఈ రాశిలోనే ప్రవేశించబోతున్నాయి. కాబట్టి వీటి ప్రభావం కూడా ఈరాశిపైనే ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి  చెందిన వ్యక్తులు డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు కల నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 
కర్కాటకం (Cancer): ఈ రాశి వారికి కొత్త పనులు ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ-వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. విద్యారంగంలో పనిచేస్తున్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. కుటుంబంతో గడపడానికి ఇదే మంచి సమయం. 

మిథునం (Gemini): గ్రహాల స్థానం మార్పు కారణంగా ఈ రాశివారు భారీగా లాభపడతారు. ఆస్తి లావాదేవీలకు సంబంధించి ఇదే మంచి సమయం. మీరు కొత్త వనరుల ద్వారా ఆదాయం పెంచుకుంటారు. సూర్యుడి సంచారం వల్ల మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 
మీనం(Pisces): మీన రాశివారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీరు వ్యాపారంలో పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Surya Mahadasha Effect: 6 ఏళ్లపాటు ఉండే సూర్య మహాదశ.. దాని ప్రభావం ఎలా ఉంటుందంటే.. ఇవీ పరిహారాలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News