Shoonya masam 2021 or Dhanurmasam 2021- 2022 Date, Significance And Everything You Need to Know : ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రారంభమైన శూన్యమాసం జనవరి 14, 2022 న ముగుస్తుంది. దీన్నే ధనుర్మాసం అని అంటారు. ఈ మాసాన్నే ఉత్తరాధిలో ఖర్మాలు (Kharmas 2021) అని పిలుస్తారు. హిందూ ధర్మం ప్రకారం.. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టకూడదు.
శూన్యమాసంలో (Shoonya masam) పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో సూర్య భగవానుడిని పూజిస్తే మంచిది. మకర సంక్రాంతితో (Makara Sankranti) ధనుర్మాసం (Dhanurmasam) ముగుస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజున మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం. అయితే ఈ నెలలో ప్రత్యేకంగా కొన్ని పనులు తప్పకుండా చేయాలి.. కొన్ని అస్సలు చేయకూడదు..
శూన్య మాసంలో (Shoonya masam) తప్పక చేయవలసిన పనులు..
హిందూ ధర్మం ప్రకారం.. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తూ పూజించాలి. అలాగే స్వచ్ఛమైన హృదయంతో దానం చేయాలి. దీంతో మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆహారం, బట్టలను దానం చేయవచ్చు. ఈ మాసంలో గోవును పూజించడం శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. దీంతో మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. భవిష్యత్తులో చాలా విషయాల్లో విజయాలు చేకూరుతాయి.
Also Read : December 22 Horoscope: ఆ రాశి వారు త్వరగా లాభం పొందాలని అలా చేయొద్దు.. మీ రాశిఫలం ఎలా ఉందో చూడండి!
శూన్య మాసంలో ఇవి అస్సలు చేయకూడదు..
ఈ మాసంలో వివాహం, నిశ్చితార్థంవంటివి చేయకూడదు. అలాగే ఈ మాసంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయకూడదు. కొత్త వ్యాపారాలు (New businesses) ప్రారంభించరాదు.. కొత్త పనులు ఏవీ కూడా ప్రారంభించకండి. ఈ మాసంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) తలెత్తుతాయి. ఈ మాసం విష్ణువుకు (Vishnu) సంబంధించినది.. పుష్య నక్షత్రంతో ఈ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం శనికి సంబంధించినది కాబట్టి దీన్ని శూన్యమాసం (Shoonya masam) అంటారు.
Also Read : Vastu Tips For Home: ఈ మూడు వస్తువులు ఇంటికి ఉత్తరం వైపు ఉంటే లక్ష్మీ కటాక్షం తథ్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook