Shanidev Favourite Zodiacs: శనిదేవుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసా?

Shanidev: ఆస్ట్రాలజీ ప్రకారం, శని గ్రహానికి ఇష్టమైన కొన్ని రాశిచక్రాలు ఉన్నాయి. వాటిపై శని మహాదశ ఎటువంటి దుష్ప్రభావం చూపదు. ఆ రాశులేంటో చూద్దాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 16, 2022, 02:18 PM IST
Shanidev Favourite Zodiacs: శనిదేవుడికి ఇష్టమైన రాశులేంటో తెలుసా?

Shani Favourite Zodiacs: శనిదేవుడు వ్యక్తి యెుక్క పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. శనిదేవుడి (Shanidev) ప్రసన్నం చేసుకోవడానికి, శని వక్ర దృష్టి పడకుండా ఉండటానికి ప్రజలు అనేక పరిహారాలు చేస్తారు. అయితే ఎవరి జాతకంలో శనిగ్రహం బలంగా ఉంటే ఆ వ్యక్తి లైఫ్ బిందాస్ గా ఉంటుంది. ఎవరి జాతకంలో శని బలహీనంగా ఉంటాడో వారి జీవితం దుర్భరంగా ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడికి కొన్ని ఇష్టమైన రాశులున్నాయి. వారిపై శనిమహాదశ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. శనిగ్రహం యెుక్క ఫేవరేట్ రాశులేంటో తెలుసుకుందాం. 

తుల రాశి (Libra) - ఈ రాశివారికి శనిగ్రహం అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శనిదేవుడికి ఇష్టమైన రాశిచక్రాలలో ఇది ఒకటి. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోరు. వీరు నిజాయతీగా ఉంటారు. శని చెడుదృష్టి, సడేసతి, శనిమహాదశ ఈ రాశిపై పెద్దగా ప్రభావం చూపవు. 

మకరం (Capricron)- ఈ రాశిచక్రాన్ని పాలించే గ్రహం శని. అందుకే దీనిని శని యొక్క ఇష్టమైన రాశుల్లో ఒకటిగా భావిస్తారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేవరకు నిద్రపోరు. శని చెడు దృష్టి ఈ రాశిపై ఉండదు.  

కుంభం (Aquarius)- ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ రాశిచక్రాన్ని కూడా శని పాలిస్తుందని అంటారు. ఈ రాశివారు చాలా సహనంగా ఉంటారు. వీరు ఏ పని అయినా మెుదలుపెడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.  

Also Read: Sravana First Saturday: శ్రావణ తొలి శనివారం ఈ 5 రాశులవారికి ప్రత్యేకం!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News