Shani Vakri 2023: శని తిరోగమనం కారణంగా నవంబర్ 4వ తేదీ వరకు ఊహించని లాభాలు పొందే రాశుల వారు వీరే..

Shani Vakri 2023: శని తిరోగమన కారణంగా నవంబర్ 4వ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలను పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 7, 2023, 11:12 AM IST
Shani Vakri 2023:  శని తిరోగమనం కారణంగా నవంబర్ 4వ తేదీ వరకు ఊహించని లాభాలు పొందే రాశుల వారు వీరే..

Shani Vakri 2023: కర్మలకు ఫలితాన్ని ఇచ్చే శని గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం తిరోగమన దశలో ఇతర రాశుల్లోకి సంచారం చేసినప్పుడు ప్రత్యేక శక్తి ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశుల వారిపై సమానంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచార దశలో ఉన్నాడు. జూన్ 17వ తేదీన తిరోగమన దశలో మరో రాశిలోకి సంచారం చేసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ 4 తేదీ వరకు ఈ దశలో ఉండబోతున్నాడు. దీని కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. 

ఈ రాశుల వారిపై శని గ్రహం ఎఫెక్ట్:
వృషభం రాశి:

కుంభ రాశిలో శని గ్రహం తీరోగమన స్థితిలో సంచారం చేయబోతోంది.. దీని కారణంగా వృషభ రాశి వారి జీవితంపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. వృషభ ఈ రాశి వారి జీవితంలో ఆదాయంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో ఏ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన భారీ లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు. ఈ తిరోగమన కారణంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది.

Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో

మకర రాశి:
శని గ్రహ తిరోగమన కారణంగా మకర రాశి వారు భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో వీరికి ప్రత్యేక స్థానం ఏర్పడి గౌరవం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారు ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఓర్పుతో పెట్టుబడులు పెట్టడం వల్ల వ్యాపారాల్లో భారీ లాభాలు పొందుతారు. శని తిరోగమనం కారణంగా ఈ రాశి వారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు కూడా పెరుగుతాయి.

తుల రాశి:
శని తిరోగమనం తులారాశి వారి జాతకంలో ఐదవ స్థానంలో జరగబోతోంది. నవంబర్ 4 వరకు ఈ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సానుకూలమైన వార్తలను వింటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కారణంగా ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారు శని తిరోగమన దశలో ఎలాంటి పనులు చేసిన ఆదాయం పొందడం ఖాయం.

Also read: Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ, అత్యాధునిక ADAS ఫీచర్లతో

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News