Shani Rahu Guru Position 2024-25: ఆస్ట్రాలజీ ప్రకారం, వచ్చే ఏడాది కొన్ని గ్రహాల స్థానం అద్భుతంగా ఉండబోతుంది. 2024లో శని, రాహువు మరియు బృహస్పతి స్థానం మూడు రాశులవారికి అదృష్టాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. వచ్చే రెండేళ్లలో బృహస్పతి, శని, రాహువు గ్రహాల పొజిషన్ వల్ల ఏ రాశుల ఫేట్ మారబోతుందో తెలుసుకుందాం.
వృషభం : వచ్చే రెండేళ్లు వృషభరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు కెరీర్‌లో మంచి పురోగతిని సాధిస్తారు. మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. అనుకోకుండా మీకు ధనం చేతికి అందుతుంది. మీ ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు.
సింహం: 2024 మరియు 2025 సంవత్సరాలలో ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఫారిన్ వెళ్లే అవకాశం ఉంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
మేషం: బృహస్పతి, శని మరియు రాహువు గ్రహాల శుభ స్థానం మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీంతో మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారస్తులు మంచి లాభాలను గడిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
Also Read: Surya Gochar 2023: డిసెంబర్ 16 నుంచి ఈ 4 రాశుల దశ తిరగబోతుంది.. మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి