Shani jayanti 2023 effect on Zodiac Signs: మనం చెడ్డ పనులు చేస్తే శిక్షలు వేస్తాడు కాబట్టి శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. శని వక్ర దృష్టి ఎవరిపై పడుతుందో వారి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని జయంతి చాలా మంచిది. జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటారు. ఈసారి శని జయంతి మే 19న వస్తుంది. ఇది 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం - శనిదేవుడు అనుగ్రహం కర్కాటక రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. శని జయంతి కారణంగా మీరు కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభం ఉంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్ట లభిస్తుంది.
కుంభం - కుంభ రాశికి అధిపతిగా శనిదేవుడిని భావిస్తారు. ప్రస్తుతం శనిగ్రహం ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు సమాజంలో గౌరవం దక్కుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది.
మకరం- మకరరాశికి కూడా శనే అధిపతి. దీంతో శనిదేవుడి కటాక్షం వీరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. శని జయంతి వల్ల మీ లీడర్ షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. పాలిటిక్స్ లో ఉండే వారు లాభపడతారు.
Also Read: Mercury Transit 2023: వృషభరాశి ప్రవేశం, ఆ 5 రాశుల జీవితాల్లో జూన్ 7 నుంచి కల్లోలం తప్పదా
వృషభం - వృషభ రాశికి అధిపతి శుక్రుడు. పైగా శని మరియు శుక్రుడు మిత్రులు. అందుకే వృషభరాశి వారిపై శనిదేవుడి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. శని జయంతి వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
తుల రాశి- తులారాశికి కూడా శుక్రుడే అధిపతి. ఈ రాశిలో శని ఉన్నత స్థానంలో ఉంటాడు. అందుకే తుల రాశి వారికి శనిదేవుడి యెుక్క ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీరు ఊహించని ఐశ్వర్యాన్ని పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో పేదలకు సహాయం చేయడం, జంతువులకు ఆహారం పెట్టడం వల్ల చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
Also Read: Surya Gochar 2023: సూర్య సంచారం 2023.. కన్యా రాశి వారికి అదృష్టం! కోరుకున్న ఉద్యోగం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook