Shani Jayanti 2023: వచ్చే 50 సంవత్సరాల్లో శనిదేవుడు ఏయే రాశుల్లో సంచరించనున్నాడో తెలుసా?

Shani Jayanti 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. మరో రెండు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా వచ్చే 50 ఏళ్లు శనిదేవుడు ఏయే రాశులల్లో సంచరించబోతున్నాడో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 17, 2023, 07:03 PM IST
Shani Jayanti 2023: వచ్చే 50 సంవత్సరాల్లో శనిదేవుడు ఏయే రాశుల్లో సంచరించనున్నాడో తెలుసా?

Shani Jayanti Date: జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శనిదేవుడు జన్మించాడు. ఈసారి శని జయంతిని మే 19న జరుపుకోనున్నారు. ఈరోజున శనిదేవుడిని పూజించడం, దాన చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈసారి అమావాస్య తిథి 18 మే 2023 రాత్రి 09:44 గంటలకు ప్రారంభమై.. మే 19, 2023 రాత్రి 09:24 గంటలకు ముగుస్తుంది. ఇదే రోజున శోభన యోగం మే 18 రాత్రి 07.37 నుండి మే 19 సాయంత్రం 06.16 వరకు ఉంటుంది. అంతేకాకుండా గజకేసరి రాజయోగం కూడా రూపొందుతుంది. సూర్యుడు మరియు ఛాయాల కుమారుడిగా శనిదేవుడిని భావిస్తారు. పైగా శని, ఆదిత్యుడు శత్రువులు. 

వచ్చే 50 సంవత్సరాలు శని సంచారాలు
29 మార్చి 2025 నుండి 31 మే 2032 వరకు శని మేషరాశిలో ఉంటాడు. జూన్ 3, 2027 నుండి జూలై 13, 2034 వరకు వృషభరాశిలో సంచరిస్తాడు. 8 ఆగస్టు 2029 నుండి 27 ఆగస్టు 2036 వరకు మిథునరాశిలో, 31 మే 2032 నుండి 22 అక్టోబర్ 2038 వరకు కర్కాటకంలో, 13 జూలై 2034 నుండి 29 జనవరి 2041 వరకు సింహ రాశిలో సంచరిస్తాడు.

Also Read: Mangal Gochar 2023: వచ్చే 45 రోజులు ఈ 5 రాశులకు తిరుగుండదు.. మీ రాశి ఉందా?

అనంతరం 27 ఆగస్టు 2036 నుండి 12 డిసెంబర్ 2043 వరకు కన్యా రాశిలో, 22 అక్టోబర్ 2038 నుండి 8 డిసెంబర్ 2046 వరకు తుల రాశిలో, 28 జనవరి 2041 నుండి 3 డిసెంబర్ 2049 వరకు వృశ్చిక రాశిలో, 12 డిసెంబర్ 2043 నుండి 3 డిసెంబర్ 2049 వరకు ధనుస్సు రాశిలో, 26 జనవరి 2017 నుండి 29 మార్చి 2025 వరకు మకర రాశిలో, కుంభంలో 24 జనవరి 2020 నుండి 3 జూన్ 2027 వరకు, 29 ఏప్రిల్ 2022 నుండి 8 ఆగస్టు 2029 వరకు మీనరాశిలో శని సంచరిస్తాడు.

Also Read: Guru Gochar 2023: ఇవాళ అరుదైన గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు ప్రతి పనిలో విజయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News