Shani Jayanti 2023: మే 19న కీలక పరిణామం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Shani Jayanti 2023: మరో 5 రోజుల్లో శని జయంతి రాబోతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. శని జయంతి కారణంగా మూడు రాశులవారు ఆపారమైన డబ్బు మరియు ఊహించని ధన లాభం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 14, 2023, 04:23 PM IST
Shani Jayanti 2023: మే 19న కీలక పరిణామం.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Shani Jayanti 2023 effect: శనిదేవుడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. మనం చేసే కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు శని. మన జాతకంలో శనిదేవుడు శుభస్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. శని వక్ర దృష్టి మీపై పడిందంటే మీ జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. శని  అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. మరో 5 రోజుల్లో శని జయంతి రాబోతుంది. దీని కంటే ముందు గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది మూడు రాశులవారికి చాలా ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథున రాశి
గజకేసరి రాజయోగం ప్రభావం మిథునరాశి వారిపై కూడా కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు శుభవార్త వింటారు. మీకు కొత్ జాబ్ లభిస్తుంది. అనుకున్న సమాయనికి మీ పనులు పూర్తవుతాయి. 
మేష రాశి
శని జయంతికి ముందు చంద్రుడు, బృహస్పతి కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేషరాశి వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మీ సంపద రెట్టింపు అవుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 
తుల రాశి
ఈ రాశికి అధిపతి శుక్రుడు. పైగా శని మరియు శుక్రుడు మిత్రులు. తులరాశిలో శనిదేవుడు ఉచ్ఛ స్థితిలో ఉంటాడు. అంతేకాకుండా శని అనుగ్రహం తులరాశి వారిపై ఉంటుంది. గజకేసరి రాజయోగంలో శనిదేవుడిని పూజించడం వల్ల తులరాశి వారు ఊహించనంత డబ్బు పొందుతారు. అంతేకాకుండా మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Sun Transit 2023: ఇవాళ వృషభరాశిలోకి సూర్యుడు... వచ్చే నెల రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News