Shani Effect: శని దశ అనేది ఏ రాశి జాతకులకైనా ఇబ్బందికరమే. జనవరి 2022 నుంచి కుంభరాశి జాతకంలో ప్రారంభమైన శని దశ ఇప్పుడు రెండవ స్టేజ్‌లో ఉందంటున్నారు జ్యోతిష పండితులు. ఫలితంగా ఏయే ఇబ్బందులు ఎదురు కానున్నాయో పరిశీలిద్దాం..
గ్రహాల గోచారం, లేదా వక్రమార్గమనేది కొన్ని రాశులవారికి ప్రయోజనం చేకూరిస్తే..కొన్ని రాశుల వారికి కష్టాల్ని కల్గిస్తుంది. శనిదేవుడిని సాధారణంగా దండించేవాడిగా, న్యాయదేవతగా పిలుస్తారు. అటువంటి శని ఒకవేళ ఏదైనా రాశివారికి లాభం చేకూర్చిందంటే..ఇక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేదు. అదే చెడుగా అయితే నాశనం చేసేవరకూ వదలదు. అందుకే శని ప్రభావం అంటే భయపడతారు అంతా.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర, కుంభ రాశులకు అధిపతి శని. ప్రస్తుతం శని తన రాశి కుంభంలో ఉంది. శని ఏ రాశిలో ఉంటే ఆ రాశివారికి ఇక కష్టకాలం ప్రారంభమైనట్టే. శని ఏదైనా రాశిలో ఉన్నప్పుడు ఆ రాశివారికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. శని..కుంభరాశిలో మార్చ్ 29, 2025 వరకూ ఉంటుంది. అప్పటి వరకూ కుంభరాశివారికి ఇబ్బందులు తప్పవన్న మాట.
2022 జనవరి 24 నుంచి కుంభరాశివారికి కష్టకాలం ప్రారంభమైంది. శని దశ ఈ రాశి జాతకులపై దుష్ప్రభావం చూపించడం మొదలైంది. ఏప్రిల్ 29, 2022న శని..రాశి మారుతూ..కుంభరాశికి సంబంధించి రెండవ దశకు చేరుకుంది. శని దశ అనేది మూడు దశల్లో ఉంటుంది. రెండవ దశ అన్నింటికంటే భయంకరమైందిగా చెబుతారు. శని ప్రకోపానికి ఎవరైనా తీవ్ర పరిణాలు ఎదుర్కోవల్సిందేనంటున్నారు పండితులు. ఈ దశలో సంబంధిత వ్యక్తులకు నలువైపుల్నించీ కష్టాలెదురవుతాయి. ఏ విధమైన సహాయం కూడా అందదు.
ఒకవేళ ఏదైనా జాతకం కుండలిలో శని బలంగా ఉంటే ఆ వ్యక్తికి శని కారణంగా ప్రయోజనాలు చేకురుతాయి. శని ప్రభావం ఎప్పుడూ చెడుగానే ఉండాలని లేదు. కొంతమందికి లాభం కూడా చేకూరుస్తుంది. శని చెడుతో పాటు కొంతమందికి లాభదాయకంగా కూడా ఉంటాడు. అదే శని బలహీనంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తిని సమస్యలు చుట్టేస్తాయి. తిరిగి తేరుకోనివ్వవు.
Also read: Sun Transit May 2022: మే 15 నుండి సూర్య సంచారం.. ఈ 6 రాశుల తలరాతే మారిపోనుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook