Shatabhisha Nakshatra on March 15: మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ

Shani Dev Nakshtra Parivartan 2023:  న్యాయదేవుడు అయిన శనిదేవుడు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో 3 రాశుల వారికి లాభం చేకూరుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2023, 01:32 PM IST
Shatabhisha Nakshatra on March 15: మార్చి 15న శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ

Saturn Enter Shatabhisha Nakshatra: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో నక్షత్ర రాశులను మారుస్తూ ఉంటాయి. దీని ప్రభావం మానవ జీవితంపై మరియు భూమిపై కనిపిస్తుంది. న్యాయదేవుడు అయిన శనిదేవుడు మార్చి 15న రాహువు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శని, రాహు మధ్య స్నేహం ఉంది. శనిదేవుడి రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు అద్భుతమైన పురోగతిని లాభాలను పొందనున్నాడు.ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శనిదేవుడి రాశి మార్పు ఈరాశులకు సానుకూలం

మకర రాశిచక్రం
శనిదేవుని శతభిష నక్షత్ర మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. జాబ్ చేసేవారికి పదోన్నతి, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా నష్టపోతారు. 

మేష రాశిచక్రం
శతభిషా నక్షత్రంలో శని దేవుడి సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు లాభ మరియు కర్మ స్థానంలో కూర్చుంటాడు. దీంతో మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు పని మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తుల కోరిక నెరవేరుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాలిటిక్స్ లో ఉన్నవారు మంచి పదవిని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

మిథున రాశి
శనిదేవుడి శతభిషా నక్షత్ర ప్రవేశం మిథున రాశివారికి వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి యెుక్క ఎనిమిది మరియు తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటాడు. ఈ సమయంలో మీకు లక్ కు కలిసి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. 

Also Read: Budhaditya Rajyog: మీనరాశిలో బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు తిరుగులేనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News