Shani Effect on these 5 Zodiac signs Till Coming 13 Months : జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రహాలలో నెమ్మదిగా కదిలే గ్రహం కూడా ఇదే. అందుకే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని తన నక్షత్రాన్ని మార్చుకుంటుంది. కాబట్టి శనిగ్రహం నక్షత్రాన్ని మార్చరుకునే సమయంలో మానవ జీవితాలపై ప్రభావం చాలా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు.
అయితే శని తన నక్షత్రాన్ని మార్చుకునే ఘట్టం ఈ నెల 18న చోటు చేసుకుంది. శని ధనిష్ఠ నక్షత్రంలోకి మారాడు. దీనితో అన్ని రాశిచక్రాలపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. కానీ 5 రాశులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఆ రాశులు ఏవి? వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయాలు ఇలా ఉన్నాయి.
మేష రాశి
మేష రాశి వారికి.. శని గ్రహం నక్షత్రం మారడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉండి ఇబ్బందులు పెడుతున్న పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు లభించే వీలుంది. ఏడాది పాటు సిరి సంపదలు ఉంటాయి. కొనుగోళ్లు జరుపుతారు. ముఖ్యంగా ప్రాపర్టీని కొంటారు.
వృషభ రాశి
ఈ రాశి వారిపై కూడా శనిగ్రహం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులకు సహకారం లభిస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. ధన లాభ ఉంది. వ్యాపారులతో పాటు ఎవరైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేందుకు ఇది చాలా మంచి సమయం కాగలదు.
మిథున రాశి
మిథున రాశి వారికి శనిగ్రహం అనుకూలత కారణంగా భవిష్యత్ ఆశాజనకంగా సాగుతుంది. ముఖ్యంగా ఉద్యోగకోసం చూస్తున్న వారికి ఉపాధి లభించే అవకాశముంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కర్కాటక రాశి
ఈ రాశి వారిపై శనిగ్రహ ప్రభావం అత్యంత కీలకంగా ఉండనుంది. మీకు జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంలోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి యోగం కూడా ఉంది. వ్యాపారాలు చేసే వారు.. కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. లగ్జరీ జీవితం గడుపుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని ప్రభావం కారణంగా ధన లాభం ఉంటుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ ఆశాజనకంగా సాగుతుంది.
ఈ రాశులన్నింటిపై దాదాపు 13 నెలల పాటు శనిగ్రహం ప్రభావం సానుకూలగా ఉండొచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Shivratri 2022: శివరాత్రి రోజు ఏ పనులు చేయాలి..? చేయకూడని తప్పులు ఏమిటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook