Shani Asta In Aquarius: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా ఉదయించడం మరియు అస్తమించడం జరుగుతాయి. దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. శనిదేవుడు జనవరి 30వ తేదీ రాత్రి నాడు కుంభరాశిలో అస్తమించాడు. మళ్లీ మార్చి 5న ఉదయించనున్నాడు. శనిదేవుడు అస్తమయం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మిథున రాశిచక్రం
శని దేవుడి అస్తమయం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో 8వ మరియు 9వ గృహాలకు శని దేవుడు అధిపతి. అందుకే ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు ఫ్యామిలీతో ఏదైనా తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
మకర రాశిచక్రం
మకర రాశి వారికి శనిదేవుని అస్తమయం శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేప్పుడు ఆలోచింంచండి. ఈ రాశిని శనిదేవుడు పాలిస్తాడు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి విజయాలు సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మీన రాశిచక్రం
శనిదేవుడి అస్తమయం మీకు అనుకూలంగా ఉంటుంది. శని దేవుడు మీ రాశి నుండి 12వ ఇంట్లో సెట్ అవుతున్నాడు. దీంతో మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ప్రస్తుతం మీపై శని సడేసతి కొనసాగుతోంది. కావున దాని యెుక్క చెడు ప్రభావం కొంత మేర తగ్గుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Also Read: Venus Transit 2023: అరుదైన యోగం చేయబోతున్న శుక్రుడు... ఫిబ్రవరిలో ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook