గ్రహాలు, నక్షత్రాల స్థితిలో పరివర్తనం చాలా రకాల శుభ, అశుభ యోగాలకు కారణమౌతుంటుంది. కొన్ని యోగాలు శుభసూచకమై అదృష్టాన్ని తిరగరాస్తాయి. అటువంటిదే ఓ శుభ యోగం త్వరలో అఖండ సామ్రాజ్య యోగం ఏర్పర్చనుంది. 3 రాశులకు అంతులేని లాభాలు చేకూర్చనుంది. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవల జనవరి 17వ తేదీ శని గోచారమై మూల త్రికోణ రాశి కుంభంలో ప్రవేశించింది. అటు ఏప్రిల్ 22వ తేదీన గురు గోచారం జరగనుంది. శని, గురు గోచారం కారణంగా 3 రాశులకు అత్యంత శుభప్రదం కానుంది. శని కర్మకు, న్యాయానికి దేవత అయితే..దేవగురువు గురుడు భాగ్యం, అభివృద్ధి కురిపించేవాడు. ఏదైనా గ్రహం దీర్ఘకాలం పాటు ధనభావంలో గోచారం చేస్తే ఈ అఖండ సామ్రాజ్య యోగం ఏర్పడుతుంది. అఖండ సామ్రాజ్య యోగం జాతకులకు అపారమైన ధనలాభం, సుఖ సమృద్ధి లభిస్తుంది. ఈ జాతకం వారి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
అఖండ సామ్రాజ్య యోగంతో మారనున్న ఈ రాశుల అదృష్టం
మేషరాశి
మేషరాశి జాతకులకు అఖండ సామ్రాజ్య యోగం అత్యంత శుభసూచకంగా ఉంటుంది. ఈ జాతకం వారికి ఒకేసారి ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనముంటుంది. లాభాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్‌తో లాభం ఉంటుంది.
మిధున రాశి
మిధున రాశి జాతకులకు శని గోచారం, గురు గోచారం రెండింటి వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఈ జాతకం వారి ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగం మారే యోగం ఉంటుంది. తండ్రి తరపు సంపద లాభిస్తుంది. చాలా సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి.
మకరరాశి
మకరరాశి జాతకులకు గురువు, శని గోచారం వల్ల ఏర్పడే అఖండ సామ్రాజ్య రాజయోగం అత్యంత సమృద్దిదాయకంగా ఉటుంది. ధనలాభం కలుగుతుంది. ఆగిపోయిన డబ్బులు చేతికి తిరిగి వస్తాయి. గౌరవం పెరుగుతుంది. కుటంబంలో ఆనందం ఉంటుంది. బంధాలు మెరుగ్గా ఉంటాయి.
Also read: Budh Gochar 2023: 12 రోజుల తరువాత నుంచి ఈ రాశులకు అంతులేని డబ్బులు, వ్యాపారం వృద్ధి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook