ShaniDev: శని అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి..!

Shani Amavasya 2022: ఆగష్టు 27, 2022న భాద్రపద అమావాస్య.  ఈ అమావాస్య రోజు ఏయే పనులు చేయకూడదో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 12:44 PM IST
ShaniDev: శని అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి..!

Shani Amavasya 2022: రేపు అంటే శనివారం, ఆగస్టు 27న భాద్రపద అమావాస్య. దీనినే భాదో లేదా శని లేదా శనిశ్చరి అమావాస్య అని పిలుస్తారు. 14 ఏళ్ల తర్వాత భాద్రపద అమావాస్య (Bhadrapada Amavasya 2022) నాడు శని అమావాస్య రాబోతుంది. ఇంకో విశేషమేమిటంటే..ఈ రోజున శని తన సొంత రాశి అయిన మకరరాశిలో ఉండటం. శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి ఈ యాదృచ్చికం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే గ్రంధాల ప్రకారం, ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధం. 2022 శని అమావాస్య నాడు ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

శని అమావాస్య 2022 తేదీ
ప్రారంభం - 26 ఆగస్టు 2022, 12:23 నిమిషాలు
ముగింపు- 27 ఆగస్టు 2022, మధ్యాహ్నాం 01:46

శని అమావాస్య నాడు చేయకూడనవి:
>> శని అమావాస్య నాడు శని దేవుడిని ఆరాధించండి. శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించండి. అయితే ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు శనిదేవుడికి మీ వీపు చూపవద్దు. ఇలా చేయడం అశుభంగా భావిస్తారు.  
>>  శనిశ్చరి అమావాస్య రోజున శని దేవుడిని పూజించే సమయంలో దేవుడి కళ్లలో కళ్లు పెట్టి చూడవద్దు. శనిదేవుడు ఎవరివైపు దృష్టి సారిస్తాడో అతని జీవితం కష్టాలమయం అవుతుంది.  
>>  శనివారం రోజున గోళ్లు, జుట్టు మరియు గడ్డం కత్తిరించడం అశుభం. ఇలా చేయడం వల్ల శని దోషం కలుగుతుంది. అందుకే శని అమావాస్య నాడు ఈ పని చేయడం నిషిద్ధం. 
>> నిస్సహాయుడైన వ్యక్తి శని అమావాస్య నాడు సహాయం కోరితే.. వెంటనే చేయండి. దీంతో శనిదేవుడు సంతోషిస్తాడు.  
>> చెడు పనులు చేసేవారు శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు కాబట్టి శని అమావాస్య నాడు తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను, స్త్రీలను పొరపాటున కూడా అవమానించకండి. ఇలా చేసే వారు భవిష్యత్తులో శనిదేవుని దుష్ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది.

Also Read: Surya Rashi Parivartan: సెప్టెంబర్ 17 వరకు ఈ రాశులవారు జాగ్రత్త! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News