Shani Amavasya 2022: హిందూమతంలో శని అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉంది. పూర్తిగా భక్తిశ్రద్ధలతో ఆ రోజున పూజలు చేస్తే..శనిపీడ విరగడౌతుంది. అసలు శని అమావాస్య ఎప్పుడు, తిధి, పూజకు శుభ ముహూర్తం ఎప్పుడనేది తెలుసుకుందాం..
భాద్రపద మాసంలో శని అమావాస్య వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం 2022లో ఇది చివరి శని అమావాస్య. అందుకే ఈ శని అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ,మహత్యమున్నాయి. ఈ రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల ఆ జాతకులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. శని పీడ, శని ప్రభావం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లు..శని అమావాస్య నాడు శనిదేవుని తప్పకుండా పూజించాలి. ఈ ఏడాది శని అమావాస్య నాడు అత్యంత శుభయోగం ఏర్పడుతుంది. శని అమావాస్య ఎప్పుడు, పూజా సమయం, తిధి ఎప్పుడనేది తెలుసుకుందాం..
శని అమావాస్య 2022 తిధి, శుభ ముహూర్తం ఎప్పుడు
భాద్రపదం మాసంలో రానున్న అమావాస్య తిధి నాడు శని అమావాస్య ఉంది. ఈ తిధి ఈసారి ఆగస్టు 26 మద్యాహ్నం 12 గంటల33 నిమిషాలకు ప్రారంభమై..ఆగస్టు 27 మద్యాహ్నం 1 గంట 46 నిమిషాల వరకూ ఉంటుంది. ఉదయ తిధి ప్రకారం శని అమావాస్యను ఆగస్టు 27న జరుపుకుంటారు. శని అమావాస్యనాడు రెండు శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ యోగంలో పూజలు చేయడం అత్యంత శుభంగా పరిగణిస్తారు.
శని అమావాస్య నాడు పూర్తి భక్తి శ్రద్ధలతో శనిదేవుడిని పూజిస్తారు. ఈ రోజున ఉదయం త్వరగా లేచి..స్నానం ముగించుకుని శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ఆ తరువాత శనీశ్వరాలయానికి వెళ్లి శనిదేవుడికి గానుగ నూనెతో దీపం వెలిగించాలి. దీపంలో నల్ల నువ్వులు కచ్చితంగా ఉంచాలి. ఆ తరువాత ఆలయంలో కూర్చుని..శని చాలీసా, శని హారతి పఠించాలి. శని అమావాస్య నాడు రావిచెట్టు కింద దీపం వెలిగించడం చాలా శుభసూచకంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నమై..సుఖ సంతోషాలు, ఆశీర్వాదం అందిస్తాడని అంటారు.
Also read: Planet Changes 2022: సెప్టెంబరులో ఈ గ్రహాల స్థానం మార్పు... ఈ 5 రాశులవారి లైఫ్ కష్టాలమయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook