Sravana Masam 2022: శ్రావణ మాసం శివునికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో పరమేశ్వరుడు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి భూమిపై సంచరించడానికి వచ్చి తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్ముతారు. దేవశయని ఏకాదశి నుండి మహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి వెళతాడు. ఆ సమయంలో సృష్టి సంరక్షణ మహాదేవుడు (Lord Shiva) చూసుకుంటాడు. అందుకే ప్రజలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అయితే శ్రావణంలో మీరు చేసే చిన్న చిన్న తప్పులు శివుడికి కోపం తెప్పించవచ్చు.
శ్రావణ మాసంలో ఈ తప్పులు చేయకండి
>> శ్రావణ మాసంలో ఏ రోజైనా స్నానం చేయకుండా ఉండకూడదు లేదా ఆలస్యంగా స్నానం చేయకూడదు. శ్రావణ మాసంలో తెల్లవారుజామున స్నానమాచరించి... శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రతిరోజూ శివునికి అర్ఘ్యం సమర్పించండి.
>> శ్రావణ మాసంలో పొరపాటున కూడా నాన్ వెజ్ తినకండి. ఆల్కహాలు ముట్టకండి. ఈ సమయంలో వెల్లుల్లి-ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయ మొదలైన వాటిని తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శివునికి కోపం వస్తుంది.
>> శ్రావణ మాసంలో భక్తులు శివసాధనపై పూర్తి శ్రద్ధ వహించాలి. ఈ నెలలో విలాసాలకు దూరంగా ఉండండి. నేలపై నిద్రించండి. ఎక్కువ సేపు ధ్యానం మరియు తపస్సులో గడపండి.
>> శ్రావణ మాసంలో గడ్డం తీయకండి. జుట్టు కత్తిరించవద్దు లేదా గోర్లు తీసుకోకండి.
>> శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం కూడా నిషిద్ధం. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారిన పడతారు.
>> శ్రావణ మాసంలో రుద్రాభిషేకానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇందులో పాలు, పెరుగు, తేనె వంటి పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తారు. శివునికి పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల భక్తులు ఈ మాసంలో పాలు తాగడం నిషిద్ధం.
>> శ్రావణ మాసంలో మీ మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. మీ మనస్సులో చెడు లేదా ప్రతికూల ఆలోచనలను తీసుకురావద్దు. లేదంటే శివుడికి కోపం రావచ్చు.
Also Read: Sun Transit Effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ 4 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook