Shani Gochar 2023: కొత్త సంవత్సరంలో శనిదేవుడి సంచారం.. ఈ 3 రాశులవారు బీ అలర్ట్..

Saturn Transit January 2023: కొత్త సంవత్సరం ప్రారంభంలో శని సంచరించబోతోంది. జనవరి 17, 2023న శని తన రాశిని మార్చుకుని కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. ఇది 3 రాశుల వారిపై చెడు ప్రభావం చూపుతుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 09:36 AM IST
  • కుంభరాశిలోకి శనిదేవుడు
  • ఈ 3 రాశులవారు జాగ్రత్త
  • ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: కొత్త సంవత్సరంలో శనిదేవుడి సంచారం.. ఈ 3 రాశులవారు బీ అలర్ట్..

Shani Gochar 2023 Effect: జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనది. జాతకంలో శనిదేవుడు అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. ఈ శని పీడ ప్రభావం చాలా కాలంపాటు ఉంటుంది. జనవరి 17, 2023న శనిదేవుడు కుంభరాశిలోకి (Saturn Transit January 2023)ప్రవేశించనున్నాడు. కుంభరాశిలో శని సంచారం వల్ల నాలుగు రాశులవారు అనేక కష్టాలను ఎదుర్కోనున్నారు. కొత్త సంవత్సరంలో ఏయే రాశుల వారికి శని ఇబ్బంది కలిగిస్తుందో తెలుసుకుందాం. 

మేషం (Aries): 2023లో శని గ్రహం సంచారం వల్ల మేషరాశి వారి ఖర్చులు పెరగనున్నాయి. కుటుంబంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడనున్నాయి. మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోంటారు. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు మానుకోండి. మెుత్తానికి ఈ సమయం మీకు అననుకూలంగా ఉంటుంది. ప్రతిరోజూ శని స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. 

సింహం (Leo): సింహ రాశి వారికి 2023లో శనిదేవుడు ఇబ్బంది కలిగిస్తాడు. మీరు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. దీనికి పరిహారంగా ప్రతి శనివారం పేదలకు దానం చేయండి. 

ధనుస్సు (Sagittarius): 2023లో ధనుస్సు రాశి వారిపై శని గ్రహం ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు బాధలు కలుగవచ్చు. కెరీర్ లో అడ్డంకులు వస్తాయి. ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. . రిస్క్‌తో కూడిన పెట్టుబడులను అస్సలు చేయకండి, లేకపోతే మీరు నష్టాలను చవిచూస్తారు. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.  

Also Read: 120 రోజులుపాటు శుక్రుని రాశిలో కుజుడు... ఈ 3 రాశులవారు కెరీర్‌లో ముందుకెళ్లడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News