Saturn Transit 2023: శని కుంభరాశి ప్రవేశం, శశ మహాపురుష రాజయోగంతో ఆ మూడు రాశులకు దశ తిరిగినట్టే, ఎప్పట్నించంటే

Saturn Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అనంత విశ్వంలోని గ్రహాల కదలికకు ప్రత్యేక ప్రాధాన్యత, మహత్యముంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశించడం వల్ల ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందంటారు. ఇప్పుడు శని గ్రహం గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 25, 2023, 05:53 AM IST
Saturn Transit 2023: శని కుంభరాశి ప్రవేశం, శశ మహాపురుష రాజయోగంతో ఆ మూడు రాశులకు దశ తిరిగినట్టే, ఎప్పట్నించంటే

Saturn Transit 2023: శనిగ్రహం కుంభరాశిలో ప్రవేశించడం వల్ల శశ మహా పురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం ప్రభావం మార్చ్ 9న ప్రారంభమైపోయింది. శశ మహాపురుష రాజయోగాన్ని శుభసూచకంగా భావిస్తారు. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. కానీ మూడు రాశులపై ప్రత్యేకంగా ఉండనుంది

గ్రహాలకు నిర్ణీత కదలిక ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం వేర్వేరు సమయాల్లో వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఒక్కోసారి మిత్ర గ్రహాలతో, కొన్నిసార్లు శత్రుగ్రహాలతో ఈ కలయిక ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం శనిని కర్మఫలదాతగా పిలుస్తారు. న్యాయ దేవతగా భావిస్తారు. శని గ్రహం జనవరి 17న కుంభరాశిలో ప్రవేశించాడు. కుంభరాశి..శనిగ్రహం మూల త్రికోణ రాశి. మార్చ్ 9న కుంభరాశిలో శని ప్రవేశంతో శశ మహాపురుష రాజయోగం అత్యంత శుభసూచకంగా, శక్తివంతంగా మారింది. ముఖ్యంగా 3 రాశులపై ఈ ప్రభావం స్పష్టంగా ఉంది. 

సింహ రాశి

శశ మహాపురుష రాజయోగం ఈ రాశివారికి శుభం కల్గించనుంది. సింహ రాశి వారికి ీ రాజయోగం కారణంగా ఆర్ధిక లాభాలు కలగవచ్చు. సింహరాశి వారికి 7వ పాదంలో ఈ యోగం ఏర్పడటం వల్ల వైవాహిక జీవితం బాగుంటుంది. యువతులకు సంబంధాలు పక్కా అవుతాయి. జీతంలో ఇంక్రిమెంట్, పదోన్నతి లభిస్తుంది. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి.

కుంభ రాశి

శని తమ రాశి కుంభంలో ఉదయించడం వల్ల శశ మహా పురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం కారణంగా కుంభరాశివారి అదృష్టం మారనుంది. శశ మహాపురుష రాజయోగం కుంభరాశిలోని లగ్నపాదంలో ఉండటం వల్ల జీవిత భాగస్వామి పూర్తి సహకారం లభిస్తుంది. అదృష్టం మీ ప్రతి అడుగులో ఉంటుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌‌లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

మేష రాశి

కుంభ రాశిలో శని ఉదయించడం వల్ల మేషరాశి వారికి దశ మారనుంది. ఆర్ధిక ఇబ్బందులు పూర్తిగా దూరమౌతాయి. అన్ని కష్టాలు దూరమౌతాయి. మేష రాశివారికి 11వ పాదంలో శని ఉదయించనున్నాడు. ఈ స్థానాన్ని ధనం, ఆదాయానికి ఆవాసంగా భావిస్తారు. ఈ సమయంలో కేవలం ఆర్ధిక లాభాలే ఉంటాయి. ఉద్యోగస్థులకు అన్నివైపుల్నించి వృద్ధి కలుగుతుంది.

Also read: Mercury Transit 2023: బుధ సంచారం 2023.. ఈ రాశి వ్యక్తుల జీవితంలో అల్లకల్లోలం! ఉద్యోగం పోయే అవకాశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News