Saturn Transit 2023: 30 ఏళ్ల తరువాత కుంభరాశిలో శని ప్రభావం, జనవరి 17 ఇవాళ్టి నుంచి మారనున్న ఈ రాశుల జీవితం

Saturn Transit 2023: శనిగ్రహం 30 ఏళ్ల తరువాత తన సొంతింటికి అంటే కుంభరాశిలో తిరిగి రానున్నాడు. ఫలితగా శుభ, అశుభ ప్రభావాలు అన్ని రాశులపై పడనున్నాయి. శని గోచారం కారణంగా ఆ రాశుల డబ్బులు, సంపద,ఆరోగ్యం, కెరీర్, బంధాలపై తీవ్ర ప్రభావం పడనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2023, 07:23 AM IST
Saturn Transit 2023: 30 ఏళ్ల తరువాత కుంభరాశిలో శని ప్రభావం, జనవరి 17 ఇవాళ్టి నుంచి మారనున్న ఈ రాశుల జీవితం

జనవరి 17 రాత్రి శనిగ్రహం తన మూల త్రికోణమైన కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. శని మకర రాశి నుంచి వచ్చి కుంభరాశిలో ప్రవేశించడం వల్ల 12 రాశుల జాతకుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడనుంది. శని రాశి పరివర్తనం అన్ని రాశుల వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమ, సంతానం, విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో ఎలాంటి మార్పులున్నాయో చూద్దాం.

మేషం

ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. డబ్బులు వచ్చే మార్గాలు తెర్చుకుంటాయి. మీ పనులు పూర్తవుతాయి. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభం

ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధి ఉంటుంది. కెరీర్‌లో స్థిరత్వం లభిస్తుంది. పదోన్నతి ఉంటుంది. డబ్బులు చేతికి అందుతాయి. జీవితంలో చాలా సంతోషాలు లభిస్తాయి.

మిథునం

ఉద్యోగం మారవచ్చు. కష్టపడితేనే లాభం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి, రిస్క్ తీసుకోవచ్చు. తండ్రి తరపు బంధాలు చెడిపోయే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కర్కాటకం

మానసిక ఒత్తిడి ఉంటుంది. కానీ పనులైతే పూర్తవుతాయి. ధనలాభం ఉండవచ్చు. సంతాన సంబంధ విషయాల్లో ఆందోళన ఉండవచ్చు.

సింహరాశి

వ్యాపారంలో భారీ సాఫల్యం లభించవచ్చు. దీర్ఘయాత్రలు చేయవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి సమయం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

కన్యారాశి

అప్పులు సమస్యగా మారవచ్చు. అందుకే డబ్బులు అప్పుగా తీసుకోవద్దు. ఉద్యోగం కోసం సమయం మంచిది. మీరు కష్టపడినదానికి ప్రతిఫలం ఉంటుంది.

తులరాశి

విద్యార్ధులు కష్టపడితే మంచి లాభాలుంటాయి. పెళ్లి జీవితం బాగుంటుంది. బ్రహ్మచారులకు పెళ్లవుతుంది. పనిలో సాఫల్యం లభిస్తుంది. 

వృశ్చిక రాశి

కుటంబం నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. కుటుంబసభ్యులతో దూరంగా ఉండటం అశాంతి కల్గిస్తుంది. సంపద కొనుగోలు వ్యవహారం పూర్తవుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి

ఉద్యోగులకు అనువైన సమయం. సహచరుల్నించి సహకారం లభిస్తుంది. పదోన్నతి లభించవచ్చు. సాహసం, పరాక్రమం పెరుగుతుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకోవచ్చు. ప్రేమ జీవితం లాభిస్తుంది. 

మకర రాశి

ఈ రాశివారికి అధిక లాభాలు కలుగుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పొదుపు చేయగలుగుతారు. సంపదతో లాభం కలుగుతుంది. కెరీర్ బాగుంటుంది. 

కుంభరాశి

ఉద్యోగంలో లాభముంటుంది. మీ వ్యక్తిత్వం ప్రభావం చూపిస్తుంది. సోదర సోదరీమణుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం సంబంధిత సమస్యలు సమస్యగా మారతాయి.

మీనరాశి

ఖర్చులు పెరుగుతాయి. సమస్య సృష్టిస్తాయి. రోగులకు చికిత్సకై ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులతో ధనలాభం కలుగుతుంది. దీర్ఘయాత్రలకు వెళ్లవచ్చు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Also read: Budh Gochar 2023: బుధ గోచారం ప్రభావం, ఇవాళ సాయంత్రం 6 గంటల్నించి ఆ 4 రాశుల జీవితం ఎలా మారిపోతుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo

Trending News