Saturn Transit 2022: సాధారణంగా శనిగ్రహం రెండున్నర సంవత్సరాలకొకసారి తనరాశిని మారుస్తుంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు రాశిని మార్చింది. ఏప్రిల్ 29న శనిగ్రహం 30 సంవత్సరాల తర్వాత తన సొంతరాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించిది. దీని తర్వాత జూలై 12న శని మకరరాశిలో తిరోగమనంలో సంచరించింది. ఈ శని సంచారం (Saturn retrograde in Capricorn 2022) వల్ల కొన్ని రాశులవారిపై సడేసతి మరియు శని ధైయా ప్రారంభమైంది. శనిగ్రహం 2023 జనవరి వరకు మకరరాశిలో ఉండటం వల్ల ఈ రాశులవారికి ఇబ్బంది తప్పదు.
శనిదేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని మహాదశ ఏ రాశులపై ఉంటుందో వారు శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. జాతకంలో శని అశుభ స్థానంలో ఉన్న వ్యక్తి మంచి కర్మలు చేయకపోతే అతడి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. సడేసతి, ధైయాతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా పేదలకు సహాయం చేయాలి. అంతేకాకుండా మద్యానికి దూరంగా ఉండాలి. ప్రతి శనివారం శనిదేవుడి ఆలయంలో దీపం వెలిగించాలి.
ఈ రాశులపై శని సడేసతి, ధైయా
శని మకరరాశిలోకి ప్రవేశించిన తర్వాత ధనుస్సు, మకరం, కుంభరాశి వారికి శని సడే సతి ప్రారంభమైంది. ఇందులో సడే సతి చివరి దశ ధనుస్సు రాశి వారిపై ఉంటుంది, ఇది తక్కువ బాధను కలిగిస్తుంది. మరోవైపు అత్యంత బాధాకరంగా భావించే మకర రాశి వారికి రెండో దశ సడే సతి కొనసాగుతోంది. అంతే కాకుండా మిథున, తుల రాశి వారికి ధైయా కొనసాగుతుంది. కావున ఈ ఐదు రాశుల వారు ఈ సమయంలో వివాదాలు జోలికి పోకుండా అనవసర వివాదాల జోలికి పోకండి.
Also Read: Shani Dev:ఈ శనివారం నాడు శని దేవుణ్ణి పూజిస్తే.. ఈ 3రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook