Saturn Retrograde Effect: శని తిరోగమన ప్రభావం.. అక్టోబరు 23 వరకు ఈరాశులవారు పట్టిందల్లా బంగారమే!

Shani Vakri 2022: శనిగ్రహం జూన్ 5న కుంభరాశిలో తిరోగమనం చెందిన సంగతి తెలిసిందే. ఈ తిరోగమన ప్రభావం మెుత్తం 12 రాశుల పై అక్టోబరు 23 వరకు ఉండబోతుంది. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారు ధనవంతులు కావచ్చు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 09:39 AM IST
Saturn Retrograde Effect: శని తిరోగమన ప్రభావం.. అక్టోబరు 23 వరకు ఈరాశులవారు పట్టిందల్లా బంగారమే!

Saturn Retrograde Effect:  ఏదైనా గ్రహం యొక్క తిరోగమనం లేదా బదిలీ అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుంది. వీటిలో శని గ్రహం చాలా నెమ్మదిగా కదులుతుంది. జూన్ 5 నుంచి శనిగ్రహం కుంభరాశిలో తిరోగమనంలో (Saturn Retrograde in Aquarius 2022) ఉంది. అక్కడే అక్టోబర్ 23 అదే స్థితిలో ఉండనుంది. శని మహాదశి, శని ధైయా, శని సడే సతితో పాటు శని దర్శనం, గమనం కూడా ముఖ్యమైనవి. దీని ప్రభావం మనిషి జీవితంపై కూడా కనిపిస్తుంది. శని 141 రోజులు ఈ స్థితిలో ఉండబోతున్నాడు. శని తిరోగమనం వల్ల ఈ రాశుల వారు లాభపడబోతున్నారు.

మేష రాశి (Aries)- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారు విశేష ప్రయోజనాలను పొందబోతున్నారు. శని తిరోగమనం యొక్క సానుకూల ప్రభావం కార్యాలయంలో కనిపిస్తుంది. చాలా కాలంగా ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వారికి ఈ కాలంలో ప్రయోజనాలు లభిస్తాయి. శని అనుగ్రహం వల్ల మంచి ఆఫర్లు వస్తాయి. ఈ సమయంలో, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మరియు కోరికలన్నీ నెరవేరుతాయి. 

వృశ్చికం (Scropio): శని తిరోగమనం ఈ రాశి వారి వృత్తికి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారం మరియు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. అలాగే విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

ధనుస్సు (Sagittarius)- శనిదేవుని అనుగ్రహం వల్ల ధనుస్సు రాశి వారికి ఎంతో మేలు జరగబోతోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి సమయం. అదే సమయంలో డబ్బు కొరత కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో, భవిష్యత్తు కోసం కొన్ని పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

కుంభం (Aquarius)- ఈ రాశి వారికి కూడా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ప్రతి రంగంలో విజయం ఉంటుంది. విద్యార్థులు శని అనుగ్రహంతో లాభపడనున్నారు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.

Also Read: Pradosha vratham 2022: ఆషాఢంలోని ప్రదోష వ్రతం మహత్యమేంటి, ముహూర్తం, తేదీ ఎప్పుడు, ఏం చేయాలి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News