Saturn direct movement: అష్టగ్రహాల్లో శని కూడా ఒకటి. పురాణాల ప్రకారం, శనిదేవుడిని సూర్యదేవుడి కుమారుడిగా భావిస్తారు. మనలో చాలా మంది శనిదేవుడి పేరు వింటేనే హడలిపోతారు. ఎందుకంటే ఇతడు మనం చేసే పనులకు శిక్షలు ఇస్తాడు కాబట్టి. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తుంది. 30 ఏళ్ల తర్వాత ఇతడు తన సొంత రాశిలో ఉంటున్నాడు. కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శనిదేవుడు దీపావళికి(నవంబర్ 12) ముందు మార్గంలోకి రానున్నాడు. నవంబర్ 04 నుంచి శనిదేవుడు తన గమనాన్ని మార్చుకుని నేరుగా నడవనున్నాడు. శని గ్రహం ప్రత్యక్ష సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం: శనిదేవుడి గమనంలో మార్పు కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పోటీపరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి.
వృషభం: శనిదేవుడి ప్రత్యక్ష సంచారం వల్ల వృషభ రాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం వెల్లివిరిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందుతారు.
కన్య: శనిదేవుడు నేరుగా నడవడం వల్ల కన్యా రాశి వారు లాభపడతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Mercury Impact: బుధ మహాదశ ప్రారంభమైతే 17 ఏళ్ల పాటు తిరుగుండదిక, అంతా కనకవర్షమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook