Saturn and Venus Tranist 2022: రాశి మారనున్న శని, శుక్రుడు.. అది జరిగిన 24 గంటల్లో 5 రాశుల వారిపై ఎఫెక్ట్..

Saturn and Venus Tranist 2022: మరో నాలుగు రోజుల్లో శని, ఐదు రోజుల్లో శుక్రుడు రాశిచక్రం మారనున్నారు. ఈ ప్రభావం 5 రాశుల వారిపై పడనుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 11:21 AM IST
  • రాశి మారనున్న శని, శుక్ర గ్రహాలు
  • జూలై 12, 13 తేదీల్లో గ్రహాల రాశి మార్పు
  • ఈ ప్రభావం 5 రాశుల వారిపై పడనుంది
Saturn and Venus Tranist 2022: రాశి మారనున్న శని, శుక్రుడు..  అది జరిగిన 24 గంటల్లో 5 రాశుల వారిపై ఎఫెక్ట్..

Saturn and Venus Tranist 2022: గ్రహాల ప్రతీ కదలిక రాశిచక్రంలోని 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం అన్ని రాశుల వారిపై ఒకే విధంగా ఉండదు. కొందరికి ప్రతికూలంగా, మరికొందరికి సానుకూలంగా ఉండొచ్చు. ఈ నెల 12న శుక్రుడు, 13న శని గ్రహం రాశిచక్రం మారనున్నాయి. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శని మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహాల సంచారంలో మార్పు 5 రాశుల వారిపై ప్రభావం చూపనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సింహం: శుక్రుడి రాశి మార్పు సింహ రాశి వారికి కలిసొస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన పురోగతి ఉంటుంది. సంపాదనకు అనేక మార్గాలు ఏర్పడుతాయి. వృత్తి రీత్యా ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం,ఆరోగ్యం బాగుంటుంది.

తుల: తులా రాశికి అధిపతి శుక్రుడు. మిథున రాశిలో శుక్రుడి ప్రవేశం తులారాశి వారికి శుభసూచకం. ఈ ప్రభావంతో కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ఉద్యోగం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మికత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.

కుంభం: కుంభ రాశి వారికి ధన లాభం, సంతోషం కలుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. డబ్బుకు కొదువ ఉండదు. వ్యాపారం అనుకున్నట్లుగా ముందుకు సాగుతుంది. సృజనాత్మక ఆలోచన పెరుగుతుంది. ఒకరకంగా ఈ కాలం వరం లాంటిదనే చెప్పొచ్చు.

శని రాశి మార్పుతో ఈ 2 రాశులపై ఎఫెక్ట్

మకరరాశిలో శని తిరోగమనం కర్కాటక, వృశ్చిక రాశుల వారికి కలిసొస్తుంది. శని దైయా నుంచి విముక్తి కలుగుతుంది. చేపట్టిన ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: YSRCP Plenary Live Updates : ఘనంగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. ఇడుపులపాయలో జగన్ నివాళులు

Also Read: Heavy Rains: గోడ కూలి తల్లి, కూతురు మృతి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News