Sai baba vrat procedure: కోరిన కోరికలు తీర్చే సాయిబాబా వ్రత విధానం గురించి తెలుసుకోండి

Sai baba pupa tips: సాయిబాబా అనుగ్రహం పొందడానికి గురువారం చాలా మంచి రోజు. ఈరోజు సాయిబాబాను పూజించడం వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. సాయివ్రత విధానం గురించి తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 01:55 PM IST
Sai baba vrat procedure: కోరిన కోరికలు తీర్చే సాయిబాబా వ్రత విధానం గురించి తెలుసుకోండి

Sai baba pooja vidhanam: కులమతాలకు అతీతమైన దేవుడు సాయిబాబా (Sai baba). గురువారం సాయిబాబాను పూజిస్తే.. ఆయన ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. 'సబ్ కా మాలిక్ ఏక్ హై' అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులను ఏర్పరచుకున్న గొప్ప ఆధ్యాత్మిక వేత్త. సాయిబాబాను ప్రసన్నం చేసుకోవడానికి 9 వారాల వ్రతం చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు బాబా. ఈ వ్రతం చివరి రోజున పేదలకు దానం చేయండి. దీని  వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. అంతేకాకుండా పేదలకు డబ్బు కష్టాలు ఉండవు.

పూజా సామాగ్రి-సాయిబాబా విగ్రహం, అగరబత్తులు, చందనం, పసుపు పువ్వులు, పసుపు వస్త్రం, పంచామృతం, నెయ్యి దీపం, స్వీట్లు, పండ్లు.

సాయి వ్రత విధానం
>> గురువారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయండి. అనంతరం ధ్యానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి.
>> సాయిబాబా విగ్రహాన్ని పంచామృతంతో శుభ్రపరచండి.
>> ఇప్పుడు సాయిబాబాను పూజించి, ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయండి.
>> పూజ సమయంలో బాబా విగ్రహం పెట్టే పీటపై పసుపు గుడ్డ పరచండి. దానిపై సాయిబాబా విగ్రహాన్ని పెట్టండి.  
>> విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి ...అగరుబత్తీలు వెలిగించండి.
>> సాయిబాబాకు చందనం లేదా కుంకుమ తిలకం పూయండి. 
>> ఆ తర్వాత సాయిబాబాను పసుపు పూలతో అలంకరించండి.
>> అనంతరం సాయి వ్రత కథ, బాబా చాలీసా చదవండి.
>> చివరగా సాయిబాబా హారతి ఇవ్వండి. తర్వాత స్వీట్లు పంచిపెట్టండి. 
>> గురువారం  రోజు ఉపవాసం ఉంటూ.. ఒక్కపూట భోజనం చేస్తూ..సాయిబాను పూజించండి. 

Also Read: Sai Baba: గురువారం రోజున సాయిబాబాను ఇలా పూజించండి.. మీ కోరికలు నెరవేర్చుకోండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News